Liquor Scam: కసిరెడ్డికి సిట్ కస్టడీ
ABN , Publish Date - May 02 , 2025 | 05:40 AM
లిక్కర్ స్కామ్‌లో ప్రధాన నిందితుడిగా ఉన్న కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డిని వారం రోజులపాటు సిట్ కస్టడీకి అనుమతిస్తూ ఏసీబీ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఆయనతోపాటు సజ్జల శ్రీధర్‌రెడ్డి కూడా 'బి' క్లాస్ సెల్ కోసం దరఖాస్తు చేశారు
విజయవాడ, మే 1 (ఆంధ్రజ్యోతి): మద్యం కుంభకోణంలో కర్త, కర్మ, క్రియగా వ్యవహరించిన కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి (రాజ్ కసిరెడ్డి)కి న్యాయస్థానం షాక్ ఇచ్చింది. ఆయన్ను వారం రోజులపాటు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) కస్టడీకి ఇస్తూ విజయవాడ ఏసీబీ కోర్టు గురువారం ఉత్తర్వులు ఇచ్చింది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు విచారణకు అనుమతించింది. సిట్ అధికారులు శుక్రవారం ఉదయం రాజ్ కసిరెడ్డిని జైలు నుంచి కస్టడీకి తీసుకుంటారు. ఏడు రోజులు ప్రశ్నించనున్నారు. మరోవైపు.. లిక్కర్ కేసులో అరెస్టయి విజయవాడ జిల్లా జైలులో ఉన్న కసిరెడ్డి, సజ్జల శ్రీధర్‌రెడ్డి తమకు ‘బి’ క్లాస్ సెల్ ఇవ్వాలని గురువారం కోర్టులో మెమో దాఖలు చేశారు. అదేవిధంగా ఇంటి నుంచి భోజనాన్ని కూడా అనుమతించాలని కోరారు. దీనిపై విచారణను న్యాయాధికారి పి.భాస్కరరావు శుక్రవారానికి వాయిదా వేశారు.