Share News

Vijayawada: కనకదుర్గమ్మకు భాగ్యనగర్‌ బంగారు బోనాలు

ABN , Publish Date - Jun 30 , 2025 | 04:13 AM

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మకు శ్రీభాగ్యనగర్‌ మహంకాళి బోనాల జాతర ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ అధ్యక్షుడు గోపిశెట్టి రాఘవేందర్‌ ఆధ్వర్యంలో...

Vijayawada: కనకదుర్గమ్మకు భాగ్యనగర్‌ బంగారు బోనాలు

విజయవాడ (వన్‌టౌన్‌), జూన్‌ 29 (ఆంధ్రజ్యోతి): విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మకు శ్రీభాగ్యనగర్‌ మహంకాళి బోనాల జాతర ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ అధ్యక్షుడు గోపిశెట్టి రాఘవేందర్‌ ఆధ్వర్యంలో సుమారు 500 మందికి పైగా భక్తులు ఆదివారం బంగారు బోనాలు సమర్పించారు. తొలుత బంగారు బోనాలతో ఊరేగింపుగా ఇంద్రకీలాద్రి చేరుకున్నారు. ప్రత్యేక పూజల్లో దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, దుర్గగుడి ఈవో శీనానాయక్‌ పాల్గొని దుర్గమ్మకు బోనాలు సమర్పించారు.

Updated Date - Jun 30 , 2025 | 04:14 AM