మహిళలు ఆర్థిక ప్రగతి సాధించాలి
ABN , Publish Date - Mar 08 , 2025 | 12:05 AM
మహిళలు ఆర్థికంగా పురోగతి సాధించాలని ఐసీడీఎస్ సీడీపీవో సావిత్రమ్మ, వెలుగు ఏపీఎం శ్రీధర్ అన్నారు.
చాపాడు/కొండాపురం, మార్చి 2 (ఆంధ్రజ్యో తి):మహిళలు ఆర్థికంగా పురోగతి సాధించాలని ఐసీడీఎస్ సీడీపీవో సావిత్రమ్మ, వెలుగు ఏపీఎం శ్రీధర్ అన్నారు. జాతీయమహిళా దినోత్సవం సందర్భంగా శుక్రవారం వెలుగు కార్యాలయంలో డ్వాక్రా మహిళలకు ఆటల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీడీపీవో మాట్లాడుతూ మహిళలు చదువుకుంటే ఇంటిలో వెలుగులు విరాజిల్లుతాయన్నారు. ఆటల పోటీల్లో గెలుపొందిన మహిళలకు అధికారులు బహుమతులు పంపిణీ చేశారు. కాగా కొండాపురం ఎస్టీ కాలనీలోని అంగనవాడీ కేంద్రంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని శుక్రవారం అంగన వాడీ వర్కర్లు, మహిళా ఉద్యోగుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిం చారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి, పలువురు ఉద్యోగులను సన్మా నించారు. అదే విధంగా మహిళా ఉద్యోగులకు ఆటలపోటీలను నిర్వహించారు. కార్యక్రమంలో మహిళా ఉద్యోగులు డేరా జ్యోతి, పద్మావతి, తులసి, మౌనిక తదితరులు పాల్గొన్నారు.
ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి
ప్రొద్దుటూరు టౌన్, మార్చి 7 (ఆంధ్రజ్యోతి): మహిళలు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని డీఎస్పీ పి.భావన పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురష్కరించుకుని శుక్రవారం జిల్లా పోలీసు శాఖ, సంస్కృతి స్వచ్ఛంద సేవా సంస్థ, వికసిత ఫౌండేషన్ ఆద్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఎస్వీ డిగ్రీ కళాశాల, వాగ్దేవి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులతో గీతాశ్రమం నుంచి పుట్టపర్తి సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో తమ ప్రతిభను నిరూపించుకుంటున్నారన్నారు. కార్యక్రమంలో సంస్కృతి స్వచ్ఛంద సేవా సంస్థ కార్యదర్శి ఒంటేరు శ్రీనివాసులరెడ్డి, డాక్టర్ వరుణ్‌కుమార్‌రెడ్డి, వికసిత ఫౌండేషన్ అధ్యక్షురాలు శూలం లక్ష్మిదేవి, ఎస్వీ డిగ్రీ కళాశాల కోఆర్డినేటర్ గౌరీశంకర్, దావీదు, మౌనయ్య, హేమలత, విమల, పాల్గొన్నారు. పురుషులతో సమానంగా మహిళలు సమానత్వం సాధించినప్పుడే అభివృద్ధి సాధ్యమని ఐద్వా జిల్లా కార్యదర్శి ముంతాజ్‌బేగం, సీఐటీయూ జిల్లా కార్యదర్శి సత్యనారాయణ, జేవీవీ రాష్ట్ర కార్యదర్శి తవ్వా సురేష్‌లు పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురష్కరించుకుని శుక్రవారం సీఐటీయూ కార్యాలయంలో కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలు పురోగమిస్తున్నా ఇప్పటికి వారిపై అత్యాచారాలు, వేదింపులు, అధికమవుతుండడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు బాలసుబ్బయ్య, రాఘవ, ఐద్వా పట్టణ కార్యదర్శి వెంకటసుబ్బమ్మ, సర్వేశ్వరి, రాములమ్మ, లక్ష్మిదేవి, నాగలక్ష్మి, జయమ్మ, కళావతి, దుర్గ, పాల్గొన్నారు.
ప్రొద్దుటూరు రూరల్‌లో: అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల సందర్బంగా మండల పరిఽధిలోని స్కాలర్ పబ్లిక్ స్కూల్‌లో ఐసీ డీఎస్ చౌడూరు సెక్టార్ సూపర్‌వైజర్ ఈశ్వరమ్మ ఆధ్వర్యంలో బాలికలకు 2కేరన పోటీలను నిర్వహించారు. పాఠశాల కర స్పాండెంట్ బాల సుబ్బారెడ్డి, హెచఎం రాజేంద్ర, అంగనవాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.