మహిళలు విద్యావంతులు కావాలి
ABN , Publish Date - Mar 08 , 2025 | 11:46 PM
మహిళలు ఉన్నత చదువులతో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆర్డీవో ఆదిమూలం సాయిశ్రీ పేర్కొన్నారు.

అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంలో జమ్మలమడుగు ఆర్డీవో సాయిశ్రీ ఘనంగా మహిళాదినోత్సవ వేడుకలు
ప్రొద్దుటూరుటౌన/ జమ్మలమడుగు, మార్చి 8 (ఆంధ్రజ్యోతి): మహిళలు ఉన్నత చదువులతో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆర్డీవో ఆదిమూలం సాయిశ్రీ పేర్కొన్నారు. శనివారం జిల్లా పోలీసు శాఖ, సంస్కృతి స్వచ్ఛంద సేవా సంస్థ, వికసిత ఫౌండేషన్ ఆధ్వర్యంలో పీఎన్‌ఆర్ ఫంక్షన్ హాలులో మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ మహిళలు ఉన్నతస్థాయికి చేరినప్పుడే గుర్తింపు, గౌరవం లభిస్తుందన్నారు. డీఎస్పీ బావన మాట్లాడుతూ చదువుతోనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందనిన్నారు. ట్రైనీ డీఎస్పీ భవానీ మాట్లాడుతూ లింగ వివక్ష లేకుండా పిల్లలను పెంచినప్పుడే మహిళలపట్ల వివక్ష తొలగిపోతుందన్నారు. అనంతరం వివిద సామాజిక, సేవా రంగాల్లో సేవలు అందించిన మహిళలను ఘనంగా సత్కరించి మెమెంటోలను బహూకరించారు. ఈ కార్యక్రమంలో సంస్కృతి సేవా సంస్థ కార్యదర్శి ఒంటేరు శ్రీనివాసులరెడ్డి, జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి కమిటీ సభ్యుడు డాక్టర్ వరుణ్‌కుమార్‌రెడ్డి, వికసిత ఫౌండేషన్ ఛైర్మన్ శూలం లక్ష్మిదేవి, శూలం ప్రసాద్, సావిత్రి, నెహ్రూ యువకేంద్రం సభ్యురాలు భారతి, పాల్గొన్నారు. జమ్మలమడుగులోని గౌషియాషాదీఖానాలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంలో జమ్మలమడుగు ఆర్డీవో సాయిశ్రీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మహిళలను గౌరవించాలన్నారు. అర్బన్ సీఐ లింగప్ప ఆధ్వర్యంలో కార్యక్ర మం నిర్వహించారు. ప్రొద్దుటూరు ఎన్జీవో హోంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్ర మంలో డాక్టర్ సురేఖ ఎన్జీవో అసోసియేషన్ అధ్యక్షుడు కేజే రఘురామిరెడ్డి. మహిళా విభాగం అధ్యక్షురాలు జయమ్మ, సహాధ్యక్షుడు సదాశివయాదవ్, ఉపాధ్యక్షులు మధు, శివరామానుజ, నాగరాజు, ఆర్గనైజింగ్ సెక్రటరి ప్రభంజన్, జాయింట్ సెక్రటరి నాగార్జున తదితరులు పాల్గొన్నారు.
ప్రతి మహిళా ఒక శక్తి స్వరూపమే
బద్వేలు, మార్చి 8 (ఆంధ్రజ్యోతి): ప్రతి మహి ళా ఓ శక్తి స్వరూపమేనని, మహిళల పట్ల గౌర వభావంతో మెలగాలని నియోజకవర్గ శాసన సభ్యురాలు డాక్టర్ దాసరి సుధ అన్నారు. శని వారం రాచపూడి నాగభూషణం డిగ్రీ, పీజీ కళాశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. విద్యాసంస్థ పరి పాల నాదికారి సాయిక్రిష్ణ, బోర్డు మెంబర్ సుజన, మహిళా అధ్యాపకులు షాహిన, లక్ష్మిదే వి, రాధా, డాక్టర్ రామసుధ, సల్మా, తులసి పాల్గొన్నారు.
పోరుమామిళ్లలో: మహిళా సాధికారతతోనే సమాజంలోని అన్ని రంగాలు అభివృద్ధి చెం దుతాయని బద్వేలు ఎమ్మెల్యే డాక్టర్ సుఽధా, మాజీ ఎమ్మెల్యే కమలమ్మ, జిల్లా కాంగ్రెస్ కమి టీ అధ్యక్షురాలు ఎనడీ విజయజ్యోతి పేర్కొ న్నారు. శనివారం ఎస్టీయు ఆధ్వర్యంలో పోరు మామిళ్లలోని ఎస్టీయూ భవనలో జిల్లా మహి ళా కమిటీ కన్వీనరు కవిత అధ్యక్షతన అంత ర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వ హించారు. అనంతరం బికోడూరు ఎంపీపీ చెన్నమ్మను పోరుమామిళ్ల మాజీ జడ్పీపటీసీ శారదమ్మ, మాజీ ఎంపీపీ ఈశ్వరమ్మ, ఎంపీ టీసీ పుష్పలత, టేకూరుపేట వైద్యురాలు వివేకా నంద సేవాశ్రమం నిర్వాహకు రాలు రామతు లసితో పాటు పంచాయతీ పాఽరిశుధ్య కార్మికుల ను పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఎస్టీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఇలియాస్‌బాషా, సంగమేశ్వర్‌ఱెడ్డి, రాష్ట్ర కార్యవ ర్గసభ్యులు రమణారెడ్డి, బాలగంగి రెడ్డి, రామ్మో హన, సుబ్రమణ్యం, సౌజన్య పాల్గొన్నారు.
ఉత్తమ అంగనవాడీ టీచర్‌గా పద్మావతి
కొండాపురం, మార్చి 8 (ఆంధ్రజ్యోతి): ఉత్తమ అంగనవాడీ టీచర్‌గా మండలంలోని గండ్లూరు అంగనవాడీ టీచర్ పద్మావతి అవార్డు అందుకు న్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా కడపలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఐసీడీ ఎస్ పీడీ శ్రీలక్ష్మి చేతుల మీదుగా శనివారం ఆమె మెమెంటో అందుకున్నారు. అంగనవాడీ పాఠశాలలో పిల్లలను తీర్చిదిద్దడంలో కృషి చేసినందుకు ఆమె ఈ అవార్డును అందుకున్నా రు. ఈ అవార్డు తనకు మరింత బాధ్యతను పెంచిందని ఆమె కృతఙ్ఞతలు తెలిపారు.
ముద్దనూరులో:అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఉత్తమ మహిళా ఉద్యోగి అవార్డులు శిశుసంక్షేమ శాఖ ముద్దనూరు ప్రాజెక్టు నుంచి ముద్దనూరు మండలానికి సంబందించి అంగన్వాడీ కేంద్రం-1 కార్యకర్త ఎల్.ప్రభావతి అందుకున్నట్లు సీడీపీవో ముంతాజ్ బేగం తెలిపారు. జిల్లా శిశుసంక్షేమ శాఖ ప్రాజెక్టు కార్యాలయంలో శిశుసంక్షేమ శాఖ పీడీ శ్రీలక్ష్మి చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. ముద్దనూరు తహసీల్దారు వరదకిశోర్‌రెడ్డి తమ మాతృమూర్తి ప్రభావతికి ఉత్తమ మహిళా ఉద్యోగి అవార్డు రావడంతో సంతోషం వ్యక్త పరచారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పోలీస్ స్టేషన్‌లో సీఐ దస్తగిరి ఆధ్వర్యంలో మహిళా కానిస్టేబుల్‌లు కేక్ కట్ చేసి ,శుభాకాంక్షలు తెలియజేశారు.