Share News

ప్రాణాలు పోయాక సర్వీసు రోడ్డు వేస్తారా?

ABN , Publish Date - Jan 04 , 2025 | 11:22 PM

‘ఏళ్ల కొద్దీ టోల్‌ప్లాజా వసూలు చేసుకుంటున్నారు.. రూ. కోట్లు సంపాదించారు.. అభివృద్ధి పనులు దగ్గరకొచ్చేసరికి మాత్రం పక్కనబెట్టారు. ప్రజలు ప్రమాదాలపాలై ప్రాణాలు కోల్పోయాక సర్వీసు రోడ్లు వే స్తారా.. ఏం తమాషాగా ఉందా.. ఒక్కపైసా టోల్‌ప్లాజా కట్టం, ప్రజలు మీపై తిరగబడి ధర్నాలు, రాస్తారోకోలో చేసినా మీదే బాధ్యత’ అంటూ ఎంపీపీ చీర్ల సురేశయాదవ్‌, ఎంపీటీసీ సభ్యుడు నిరంజనరెడ్డి, చెన్నూరు నీటి సంఘం అధ్యక్షుడు గోదిన శ్రీనివాసులు, కోఆప్షన సభ్యులు వారిష్‌, సర్పంచలు టోల్‌ప్లాజా సిబ్బందిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు

ప్రాణాలు పోయాక సర్వీసు రోడ్డు వేస్తారా?
టోల్‌ప్లాజా సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఎంపీపీ సురేశయాదవ్‌, ఎంపీటీసీలు, సర్పంచలు

ఒక్క పైసా టోల్‌ప్లాజా చెల్లించం

ప్రజలు ధర్నాలు, రస్తారోకోలు చేస్తే మీ బాధ్యతే

టోల్‌ప్లాజా సిబ్బందిపై ఎంపీపీ ఆగ్రహం

చెన్నూరు, జనవరి 4 (ఆంధ్రజ్యోతి) : ‘ఏళ్ల కొద్దీ టోల్‌ప్లాజా వసూలు చేసుకుంటున్నారు.. రూ. కోట్లు సంపాదించారు.. అభివృద్ధి పనులు దగ్గరకొచ్చేసరికి మాత్రం పక్కనబెట్టారు. ప్రజలు ప్రమాదాలపాలై ప్రాణాలు కోల్పోయాక సర్వీసు రోడ్లు వే స్తారా.. ఏం తమాషాగా ఉందా.. ఒక్కపైసా టోల్‌ప్లాజా కట్టం, ప్రజలు మీపై తిరగబడి ధర్నాలు, రాస్తారోకోలో చేసినా మీదే బాధ్యత’ అంటూ ఎంపీపీ చీర్ల సురేశయాదవ్‌, ఎంపీటీసీ సభ్యుడు నిరంజనరెడ్డి, చెన్నూరు నీటి సంఘం అధ్యక్షుడు గోదిన శ్రీనివాసులు, కోఆప్షన సభ్యులు వారిష్‌, సర్పంచలు టోల్‌ప్లాజా సిబ్బందిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో కొత్తరోడ్డుపై ఎన్నో ప్రమాదాలు జరిగాయని, ఎంతో మంది వికలాంగులయ్యారని, దీని కారణం సర్వీసురోడ్లు వేయకపోవడమేనని సభ్యులు తెలిపారు. తొమ్మిదేళ్లయింది నెలనెలా కోట్ల రూపాయలు వసూలు చేసుకున్నారు. ఎమ్మెల్యే పుత్తా క్రిష్ణచైతన్యరెడ్డి సైతం మిమ్మల్ని హెచ్చరించినా మీ తీరు మాత్రం మారడంలేద అని ఆగ్రహం వ్యక్తం చేశారు. చెన్నూరు నీటి సంఘం అధ్యక్షుడు మాట్లాడుతూ కారులో కాకుండా కొత్త రోడ్డు పై నుంచి బస్సులో వెళితే ప్రజల ఇబ్బందులు తెలుస్తాయి అని హెచ్చరించారు. ఎంపీపీ మాట్లాడుతూ హైవేపై ప్రాజెక్టు డైరెక్టరు ఢిల్లీ నుంచి ఏమన్నా రావాల్నా.. పనులు చేయాలంటే ఆయననే సమావేశానికి రమ్మనండి, ఇక మీరెవరూ రావద్దని హెచ్చరించారు. అలాగే రామాలయం వద్ద గృహ సముదాయాలు పెరిగినా త్రీఫేజ్‌ కరెంటు లేదని, బయనపల్లె, బుడ్డాయపల్లెల్లో అంగన్వాడీ కేంద్రాలు అసంపూర్తిగా ఉన్నాయన్నారు. రామనపల్లెలో సబ్‌స్టేషన పరిస్థితి ఏంటి, సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఎక్స్‌రే పనిచేయక ఎంతో కాలమైనా పట్టించుకోలేదన్నారు. టోల్‌ప్లాజా సిబ్బంది మాట్లాడుతూ హైవే సమస్యలు ఎనహెచఐ పీడీకి చెప్పామన్నారు. అలాగే ఉప్పరపల్లె ఎంపీటీసీ మాట్లాడుతూ పీహెచసీలో ల్యాబ్‌టెక్నిషియన పనితీరు సరిగా లేదని, రోగులకు సరిగా సమాధానం చెప్పడం లేదన్నారు. నరసారెడ్డిపల్లె వద్ద కేసీ మెయిన కెనాల్‌ లైనింగ్‌ దెబ్బతిని పెద్ద గుంతలు పడి రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. పీహెచసీ వైద్యాధికారి సాగరకుమారి మాట్లాడుతూ హాస్పిటల్‌ భవనం పూర్తి కాలేదన్నారు. ల్యాబ్‌ టెక్నిషియన పనితీరుపై ఉన్నతాధికారులకు నివేదిక పంపామన్నారు. పీహెచసీ వైద్యాధికారి డాక్టర్‌ చెన్నారెడ్డి మాట్లాడుతూ పింఛన్ల అవకతవకలపై వచ్చే వారంలో పూర్తిస్థాయిలో ఉన్నధికారుల ఆదేశాల మేరకు వెరిఫికేషన ఉంటుందని తెలిపారు. ఆర్‌డబ్ల్యుఎస్‌ ఏఈ ఉమామహేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ త్వరలో కొత్తగా టెండర్లు పిలుస్తామన్నారు.ఈవోఆర్‌డీ సురేశబాబు మాట్లాడుతూ గ్రామాల్లో మెడికల్‌ క్యాంపులు, దోమల నివారణకు ఫాగింగ్‌ చేస్తున్నామన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో కిరణ్‌మోహనరావు, పంచాయతీరాజ్‌ ఏఈ మల్లిఖార్జున. డీటీ వెంకటరమణ, ఎంఈవోలు గంగిరెడ్డి, సునీత, ఎంపీటీసీ నాగిరెడ్డి, సర్పంచలు నారాయణరెడ్డి, వెంకటసుబ్బయ్య, సుదర్శనరెడ్డి, కార్యదర్శులు రామసుబ్బారెడ్డి, శివకుమార్‌, సుబ్రమణ్యంలతో పాటు ఏపీవో, ఏపీఎం, ఐసీడీఎస్‌, ఏఓ శ్రీదేవి, పశువైద్యాధికారి ఉపేంద్ర తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 04 , 2025 | 11:22 PM