Share News

విద్యార్థుల చేత వెట్టిచాకిరి చేయిస్తే ఊరుకోం

ABN , Publish Date - Jan 30 , 2025 | 11:46 PM

విద్యార్ధుల చేత వెట్టి చారికి చేయించి వేధింపులకు గురిచేస్తే ఊరుకోమని టీఎనఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, తంబళ్లపల్లె నియోజకవర్గ టీడీపీ నేత కట్టా దొరస్వామినాయుడు హెచ్చరించా రు.

విద్యార్థుల చేత వెట్టిచాకిరి చేయిస్తే ఊరుకోం
విద్యార్థులతో మాట్లాడుతున్న టీడీపీ నేత దొరస్వామినాయుడు

ములకలచెరువు, జనవరి 30(ఆం ధ్రజ్యోతి): విద్యార్ధుల చేత వెట్టి చారికి చేయించి వేధింపులకు గురిచేస్తే ఊరుకోమని టీఎనఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, తంబళ్లపల్లె నియోజకవర్గ టీడీపీ నేత కట్టా దొరస్వామినాయుడు హెచ్చరించా రు. కస్తూర్బా బాలికల విద్యాలయం లో విద్యార్ధుల చేత వెట్టిచాకిరీ చేయించడం, వేధింపులకు గురిచేయడం, డబ్బులు వసూలు చేస్తున్నట్లు సామాజిక తనిఖీ బృందం నిగ్గు తేల్చడంతో గురువారం పాఠశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్ధులను తమ సొంత బిడ్డలుగా చూడాల్సి పోయి వేధించి భోజనం సరిగా పెట్టకపోవడం దారుణమన్నారు. అనంతరం పాఠ శాలలో ఉన్న మందులు పరిశీలించి సరపడా లేకపోవడంపై సిబ్బందిని ప్రశ్నించా రు. విద్యార్ధులులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్ధులకు రెండు నెలలకు సరిపడా సేప్టీ న్యాప్‌కిన్సను తన సొంత ఖర్చుతో పంపుతానని తెలి పారు. ఆయన వెంట కేవీఎన టమోటా మండీ యజమాని కట్టా విజయ్‌నాయుడు తదితరులు ఉన్నారు.

Updated Date - Jan 30 , 2025 | 11:46 PM