Share News

యుద్ధంతో దేశాభివృద్ధికి ఆటంకం : ఎమ్మెల్యే

ABN , Publish Date - Feb 17 , 2025 | 11:38 PM

యుద్ధాలతో దేశాభివృద్ధికి ఆటంకమే కాకుండా ఆర్థిక ప్రగతికి ఆగిపోతుందని మదనపల్లె ఎమ్మెల్యే షాజహానబాషా పేర్కొ న్నారు.

యుద్ధంతో దేశాభివృద్ధికి ఆటంకం : ఎమ్మెల్యే

మదనపల్లె అర్బన, ఫిబ్రవరి 17(ఆంధ్రజ్యోతి):యుద్ధాలతో దేశాభివృద్ధికి ఆటంకమే కాకుండా ఆర్థిక ప్రగతికి ఆగిపోతుందని మదనపల్లె ఎమ్మెల్యే షాజహానబాషా పేర్కొ న్నారు. సోమవారం స్థానిక జిల్లా పరిషత ఉన్నతపాఠశాలలో రాయచోటికి చెందిన సేవ్‌ హెర్త్‌.. నో వార్‌ ఆర్గనైజే షన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్యఅ తిథిగా స్థానిక ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడుతూ వ్యక్తిగతంగా ఉన్న విభేదాలను దేశాల పై చూపరాదన్నారు. విద్యార్థుల దశ నుంచే మంచిని గ్రహించి మంచి సమాజ స్థాపన కు రూపకర్తలు కావాలన్నారు. మదనపల్లె నుంచే గతంలో జాతీయ గీతం అనువదిం చడం, జాతీయ ఉద్యమాలకు నాంది పలికింది ఇక్కడేనన్నారు. శాంతి కోసం మదనప ల్లె నుంచే మొదటి అడుగు వేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జ్థానాంబిక విద్యా సంస్థల అధినేత రాటకొండ గురుప్రసాద్‌, విజయభారతి సేతు, జ్ఞానోదయ కామకొటి ప్రసాద రావు, గౌతమ్‌ స్కూల్‌ కరస్పాండెంట్‌ లక్ష్మీనారాయణ, విశ్వం ఇంజనీరింగ్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ శ్రీనివాసులురెడ్డి, మిట్స్‌ కళాశాల రాజేష్‌, ఆదిత్యా కళాశాల అమరనాథ్‌రెడ్డి, బ్రహ్మకుమారీస్‌ పద్మా, పోర్డు సంస్థ డైరెక్టర్‌ లలితమ్మ, ముత్తుస్కూల్‌ ప్రిన్సిపాల్‌ కవితారాణి, బీటీ కళాశాల మాజీ కరస్పాండెంట్‌ మునిరత్నం, రాష్ట్ర బీసీసెల్‌ అధికారప్రతినిథి గుత్తికొండ త్యాగరాజ, టీడీపీ నాయకులు యర్రబల్లి వెంకటరమణారెడ్డి, నవీనచౌదరి, పూలకుంట్ల హరిబాబు, కత్తి లక్ష్మున్న, పురుషోత్తం, పరుపుల జయరాం, గురునాథ్‌,వేణుగోపాల్‌, ఎంఈవోలు ప్రభాకరెడ్డి, రాజగోపాల్‌, హెచఎంలుపురం వెంకటరమణ, సుబ్బారెడ్డి, రాజేంద్రబాబు, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - Feb 17 , 2025 | 11:39 PM