ఓటరు నమోదు తప్పనిసరి
ABN , Publish Date - Jan 25 , 2025 | 11:57 PM
యువతీ, యువకులు 18 ఏళ్లు నిండిన వారంద రు ఓటరుగా నమోదు చేయించుకోవాలని మద నపల్లె సబ్‌కలెక్టర్ మేఘస్వరూప్ పేర్కొన్నారు.

18 ఏళ్లు నిండిన యువతీ, యువకులు అందరూ ఓటరుగా నమోదు చేసుకోవాలి మదనపల్లె సబ్ కలెక్టర్ మేఘస్వరూప్ వెల్లడి
మదనపల్లె టౌన, జనవరి 25(ఆంధ్రజ్యోతి): యువతీ, యువకులు 18 ఏళ్లు నిండిన వారంద రు ఓటరుగా నమోదు చేయించుకోవాలని మద నపల్లె సబ్‌కలెక్టర్ మేఘస్వరూప్ పేర్కొన్నారు. శనివారం జాతీయ ఓటరు దినోత్సవం సంద ర్భంగా స్థానిక సబ్‌కలెక్టరేట్ వద్ద ఉద్యోగులతో ప్రతిజ్ఞ చేయించి అక్కడి నుంచి బీటీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల వరకు ఉద్యోగులు, విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ఓటు విలువ తెలుసుకుని ఓటరుగా నమోదు చేసుకో వాలన్నారు. అనంతరం నూత నంగా ఓటరుగా నమోదైన వారిని, సీనియర్ ఓటర్లను సన్మానిం చారు. ఓటుహక్కు, విలువపై విద్యార్థులకు నిర్వహించిన వక్తృత్వ, వ్యాసరచన పోటీల్లో ప్రతిభ చూపిన వారికి బహుమతులు అందజే శారు. ఈ కార్యక్రమంలో సబ్‌కలెక్టరేట్ ఇనచార్జి డీఏవో రాఘవేంద్ర, తహసీల్దార్ ఖాజా భీ, ఆర్‌ఐ శేషాద్రిరావు, సిబ్బంది పాల్గొన్నారు. స్థాని క ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల విద్యా ర్థినులు జాతీయ ఓటరు దినోత్సవం సందర్భం గా పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. కార్యక్ర మంలో ప్రిన్సిపాల్ కృష్ణవేణి, అధ్యాపకులు శ్రీని వాసులు, ఖాజావలి, మోహనబాబు, గురుమూ ర్తి, జ్యోతి, లీలా, హేమలత పాల్గొన్నారు.
పీలేరులో: జాతీయ ఓటరు దినోత్సవాన్ని శని వారం పీలేరులోని పలు శాఖల ఉద్యోగులు, విద్యార్థులు, ఎనజీవోలతో కలిసి ఘనంగా నిర్వ హించారు. పీలేరు తహసీల్దారు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పీలేరు నియోజకవర్గ ఓటరు నమోదు అధికారి రమ మాట్లాడుతూ 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమో దు చేసుకోవాలన్నారు. పలు పాఠశాలల్లో నిర్వ హించిన వక్తృత్వ, వ్యాసరచన పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థినులు వంశితా రెడ్డి, సాలేహా, సబీహాకు బహుమతులు అందజేశారు. ఓటరు నమోదులో వంద శాతం లక్ష్యాలను పూర్తి చేసిన పలువురు ఉద్యోగులకు ప్రత్యేక బహుమతులు అందించారు. సీనియర్ ఓటర్లైన టీపీ ముత్యాలు, అమీరాబీ, జయరామిరెడ్డి, జిక్రి యాలను సన్మానించారు. అంతకుమునుపు రెవెన్యూ అధికారులు విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో తహసీల్దారు భీమేశ్వర రావు, ఏఎస్‌వో రామ్మోహన, డీటీలు రెడ్డప్ప రెడ్డి, సుబ్రహ్మణ్యం, మెయిన స్కూల్ హెచఎం సురేంద్రనాథరెడ్డి, టీడీపీ నేత అమరనాథరెడ్డి, పంచాయతీ కార్యదర్శులు జ్ఞాన, బావాజీ, వీఆర్వోలు, వీఆర్‌ఏలు పాల్గొన్నారు.
ములకలచెరువులో: ఓటు విలువ తెలుసు కొని....ఓటరుగా నమోదు కావాలని తహసీల్దార్ ప్రదీప్ పేర్కొన్నారు. జాతీయ ఓటరు దినోత్స వం సందర్భంగా శనివారం శ్రీ శారదా పాఠశాల విద్యార్థులతో కలిసి స్థానిక తహసీల్దార్ కార్యా లయం నుంచి బస్టాండు సర్కిల్ వరకు ర్యాలీ చేపట్టి అనంతరం మానవహారంగా నిలిచారు. అలాగే సీనియర్ ఓటర్లును ఘనంగా సన్మా నించారు. కార్యక్రమంలో ఎంపీడీవో హరినా రాయణ, ఎస్‌ఐ నరసింహుడు, డీటీ లక్ష్మీ, ఆర్‌ఐ అనీషా, సీనియర్ అసిస్టెంట్ చంద్రశేఖర్, ఏఎస్ ఐ భాస్కర్‌నాయక్, శ్రీ శారదా హైస్కూల్ కర స్పాండెంట్ శ్రీవాణిసనతకుమార్ పాల్గొన్నారు.
పెద్దమండ్యంలో: అర్హులైన ప్రతి పౌరుడు ఓటరుగా నమోదు చేసుకోవాలని తహసీల్దార్ సయ్యద్ ఆహ్మద్ పేర్కొన్నారు. పెద్దమండ్యంలో గురువారం జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని అధి కారులు, ఉపాధ్యాయులు నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ సిటిజనలకు సన్మా నించారు. అలాగే పెద్దమండ్యం, కలిచెర్ల గ్రామా లలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఎనఎస్ ఎస్ పీవో వెంకట నరసయ్య, ఎస్‌ఐ రమణ, ప్రిన్సిపాల్‌లు రామాంజులునాయక్, అమరేంద్ర కుమార్, కూటమి నేతలు విశ్వనాధరెడ్డి, సిద్దవ రం ప్రసాద్, గంగాధర, కాలేషా, సర్పంచులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు, వీఆర్వోలు, వివిశాఖల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
నిమ్మనపల్లిలో: మండలంలో 15వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని తహసీల్దార్ ధనంజేయులు ఆద్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సంధర్బంగా స్థానిక తహసీల్దార్ కార్యాల యం నుంచి కళాశాల విద్యార్థులు, అధికారులు, పోలీసులు ర్యాలీ చేపట్టి స్థానిక బస్డాండులో మానవహరం నిర్వహించి అంబేడ్కర్ విగ్రహా నికి పూల మాల వేశారు. కార్యక్రమంలో ఎస్‌ఐ తిప్పేస్వామి, డీటీ బాబ్జి, వైస్ ప్రిన్సిపాల్ రాధా క్రిష్ణ, సీనియర్ అసిస్టెంట్ రాంప్రసాద్ కళాశాల విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
కలకడలో:ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు కలి గిన వారందరూ ఓటరుగా నమోదు చుసుకోవా లని తహశీల్దార్ ఫణికుమార్ పేర్కొన్నారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా శని వారం కలకడలో అధికారులు, విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం బస్టాండులో ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో ఎస్‌ఐ రామాంజనేయు లు, ఏఎస్‌వో రెడ్డెప్పనాయుడు పాల్గొన్నారు.
తంబళ్లపల్లెలో: యువత ఓటరుగా నమోదు చేసుకోవాలని తహసీల్దారు హరికుమార్ పేర్కొ న్నారు. శనివారం తంబళ్లపల్లెలో జాతీయ ఓట ర్ల దినోత్సవం సందర్భంగా స్థానిక ఎస్టీ గురు కుల, ప్రాథమిక పాఠశాల విద్యార్థులతో కలసి ప్లకార్డులు చేతబట్టి నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం మానవహారంగా ఏర్పడి ఓటు హక్కు ప్రాధాన్యతపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగాన్ని విద్యార్థులకు వినిపించారు. ఓటు హక్కును వినియోగించు కుంటామని ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో వీఆర్వోలు, వీఆర్‌ఏలు, సచివాలయ సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
గుర్రంకొండలో:అర్హులైన ప్రతి యువతీ, యు వకుడు ఓటరుగా నమోదు చేసుకోవాలని అధి కారులు సూచించారు. శనివారం జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా విద్యార్థులతో కలి సి అధికారులు ర్యాలీ నిర్వహించారు. అనం తరం బస్టాండులో మానవహారం నిర్వ హించా రు. కార్యక్రమంలో డీటీ బాబాజాన, అధ్యాపకు లు, వీఆర్వోలు, విద్యార్థులు పాల్గొన్నారు.
కురబలకోటలో: జాతీయ ఒటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని కురబలకోటలో శనివారం ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రెవె న్యూ అధికారులతో పాటుగా మిట్స్ ఇంజ నీరింగ్ కళాశాలకు చెందిన విద్యార్థులు పాల్గొ న్నారు. కార్యక్రమంలో ఆర్‌ఐ బాలసుబ్రమణ్యం, వీఆర్‌వో ఖార్‌బాషా, ఎనఎస్‌ఎస్ కోఆర్డినేటర్
బి.కొత్తకోటలో: జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని శనివారం బి.కొత్తకోటలో ఘనంగా జరుపుకు న్నారు. నగరపంచాయతీ కమిషనర్ పల్లవి, తహశీల్దార్ మహమ్మద్ అజారుద్దీన లు స్థానిక ఆదిత్య కాలేజి విధ్యార్థులతో కలిసి పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో డీటీ మహ మ్మద్‌అన్సారీ, నగరపంచాయతీ ఏవో రమాదేవి, ఆదిత్య ప్రిన్సిపాల్ ప్రసాద్ పాల్గొన్నారు.
కలికిరిలో: జనవరి 1వ తేదీ నాటికి 18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావా లని కలికిరి ప్రభుత్వ మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా విద్యార్థినులచే ఓటరుగా నమోదవు తామని ప్రతిజ్ఞచేయించారు. స్థానిక తహసీ ల్దారు మహేశ్వరీబాయి ఆధ్వర్యంలో పట్టణంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. బీఎల్‌ఓలు, సచివాలయ ఉద్యోగులు, వీఆర్వోలు పాల్గొన్నారు.
వాల్మీకిపురంలో:యువత ఓటరుగా నమోదు చేసుకోవాలని వాల్మీకిపురం తహసీల్దార్ పామి లేటి పేర్కొన్నారు. శనివారం ఓటు హక్కు వినియోగంపై పట్టణ పురవీధులలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో రెవెన్యూ ఇనస్పెక్టర్ సుగుణ, అధ్యాపకులు, విద్యార్థులు, రెవెన్యూ సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.
రామసముద్రంలో: 18ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని తహసీల్దార్ నిర్మలాదేవి పేర్కొన్నారు. శనివారం జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా జడ్పీ హైస్కూల్ నుంచి అంబేద్కర్ కూడలి వరకు విద్యార్థులతో ర్యాలీ నిర్వహించి మానవహారం చేశారు. ఈకార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.