Share News

రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వం లక్ష్యం

ABN , Publish Date - Jan 12 , 2025 | 11:39 PM

పాడిరైతుల సంక్షేమమం, అభివృద్ధే కూటమి ప్రభుత్వం లక్ష్య మని తంబళ్లపల్లె నియోజకవర్గ టీడీపీ నేత దాసరిపల్లె జయచం ద్రారెడ్డి పేర్కొన్నారు.

రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వం లక్ష్యం
గోపిదిన్నెలో గోకులం షెడ్డును ప్రారంభిస్తున్న టీడీపీ నేత దాసరిపల్లె జయచంద్రారెడ్డి

గోకులం షెడ్డు ప్రారంభోత్సవంలో టీడీపీ నేత జయచంద్రారెడ్డి

తంబళ్లపల్లె, జనవరి 12(ఆంధ్రజ్యో తి): పాడిరైతుల సంక్షేమమం, అభివృద్ధే కూటమి ప్రభుత్వం లక్ష్య మని తంబళ్లపల్లె నియోజకవర్గ టీడీపీ నేత దాసరిపల్లె జయచం ద్రారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం మండలంలోని గోపిదిన్నెలో గోకు లం షెడ్డును టీడీపీ నాయకులు, కార్యకర్తలతో కలసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ..రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రాగానే రైతుల సంక్షేమం కోసం రాయితీ కింద గోకులం షెడ్లను మంజూరు చేసిందన్నారు. కార్యక్రమంలో టీడీపీ మండలాధ్యక్షు డు రెడ్డప్పరెడ్డి, సిద్దమ్మ, రాజంపేట పార్లమెంటు తెలుగు యువత ఉపాధ్యక్షుడు డేరంగుల చంద్ర, రాష్ట్ర బీసీ ఉపాధ్యక్షుడు తులసీధర్‌నాయుడు, ఉత్తమ్‌రెడ్డి, చెరువు నీటి సంఘం అధ్యక్షుడుశివకుమార్‌, ఉపాధ్యక్షుడు ఆదిరెడ్డి, మండల ప్రధాన కార్య దర్శి కృష్ణమూర్తి నాయుడు, వీరాంజినేయులు, సోముశేఖర్‌, వార్డు సభ్యుడు జగదీష్‌, భాస్కర్‌, క్లస్టర్‌ ఇంచార్జి బేరి శీన, తెలుగు యువత నరసింహులు, మ్యూజికల్‌ శివ, మణి, మదనమోహనరెడ్డి, కాలానారాయణ, ఆనంద్‌నాయుడు, జయరాంరెడ్డి, శివకు మార్‌, శ్రీనివాసులు, గంగాధర్‌, బాలాజీ నాయుడు పాల్గొన్నారు.

పెద్దతిప్పసముద్రంలో: జాతీయ ఉపాధిహామీ పథకంలో భాగంగా మండలంలోని వివిధ గ్రామాల్లో మొదటి విడతగా ప్రభుత్వం 50 గోకులం షెడ్లను మంజూరు చేసింది. ఇందులో భాగంగా ఆదివారం స్థానిక పీటీఎంకు చెందిన హారున రషీద్‌ తమ పాడి ఆవుల కోసం నిర్మిం చిన పశువుల షెడ్‌ను తంబళ్లపల్లె నియోజకవర్గం టీడీపీ నాయకుడు దాసరిపల్లె జయచంద్రారెడ్డి కూటమి నాయకులతో కలిసి ప్రారం భించారు. కార్యక్రమంలో కూట మి నాయకులు అదిక సంఖ్యలో పాల్గొన్నారు.

పెద్దమండ్యంలో: కూటమి ప్రభుత్వం పాడి ఆవులకు 90 శాతం సబ్సిడీతో మం జూరు చేసి నిర్మించిన గోకులం షెడ్లు పాడి రైతులకు వరమని టీడీపీ పరిశీలకుడు సీడ్‌ మల్లికార్జుననాయుడు పేర్కొన్నారు. ఆదివారం మండలంలోని పాపేపల్లెలో గోకులం షెడ్డును ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా టీడీపీ మాజీ ఉపా ధ్యక్షుడు విశ్వనాథరెడ్డి, మాజీ మండలాధ్యక్షుడు సిద్దవరం ప్రసాద్‌, కూటమి నాయ కులు నారాయణ, శంకర్‌రెడ్డి, మహేంద్ర, వెంకట్రమణ, చంద్రారెడ్డి, గంగాధర్‌, యుగంధర్‌రెడ్డి, నాగేశ్వర్‌రెడ్డి, మహేశ్వర, కాలేషా, ఏపీవో మురళి పాల్గొన్నారు.

బి.కొత్తకోటలో: మండలంలో ఉపాధి హామీ పథకం కింద బయ్యప్పగారిపల్లె, శీలంవారిపల్లెల్లో నిర్మించిన గోకులం షెడ్లను టీడీపీ నేత దాసరిపల్లె జయచంద్రారెడ్డి ఆదివారం ప్రారంభించారు. గోకులం షెడ్లను రైతులు సక్రమంగా వినియోగించుకో వాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీవో శంకరయ్య, ఏపీడీ మధుబాబు, ఏపీవో మంజుల, టీఏ నారాయణ, రైతులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Updated Date - Jan 12 , 2025 | 11:39 PM