Share News

అట్టహాసంగా ‘స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివస్‌’ కార్యక్రమం

ABN , Publish Date - Jan 18 , 2025 | 11:58 PM

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివస్‌’ కార్యక్రమాన్ని అధికారులు శనివారం పీలేరులో అట్టహాసంగా నిర్వహించారు.

అట్టహాసంగా ‘స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివస్‌’ కార్యక్రమం
పీలేరులో ర్యాలీ నిర్వహిస్తున్న అధికారులు, ప్రజాప్రతినిధులు, డ్వాక్రా సంఘాల మహిళలు

పీలేరు, జనవరి 18(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివస్‌’ కార్యక్రమాన్ని అధికారులు శనివారం పీలేరులో అట్టహాసంగా నిర్వహించారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు, డ్వాక్రా సంఘాల మహిళలు, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, ఏపీ ట్రాన్సకో సిబ్బంది, పారిశుధ్య కార్మికులు, విద్యార్థులతో కలిసి భారీ ర్యాలీ జరిపారు. ఈ సందర్భంగా రాయ చోటి ఆర్డీవో శ్రీనివాస్‌ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశను దేశంలోనే అత్యంత పరిశు భ్రత కలిగిన రాష్ట్రంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ‘స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివస్‌’ కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. ఇకపై ప్రతి నెలా మూడవ శనివా రాన్ని స్వచ్ఛ దివస్‌గా జరుపుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో లతీఫ్‌ ఖాన, తహసీల్దారు భీమేశ్వర రావు, టీడీపీ నేతలు అమరనాథరెడ్డి, పురం రామ్మూర్తి, శ్రీకాంత రెడ్డి, పోలిశెట్టి సురేంద్ర, షౌకత అలీ, ప్రసాద్‌, చానబాషా, బుజ్జు, నౌలాక్‌, మహబూబ్‌ బాషా, వెంకటరమణ నాయక్‌, షమ, స్వర్ణ, ఏపీ పంచాయతీ కార్మికుల యూనియన రాష్ట్ర అధ్యక్షులు ధనాశి వెంకటరామయ్య, తదితరులు పాల్గొన్నారు.

బి.కొత్తకోటలో: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన స్వఛ్చ ఆంధ్ర-స్వఛ్చదివస్‌ కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములై పారిశుధ్యాన్ని పరిరక్షించాలని బి.కొత్తకోట నగరపంచాయతీ కమిషనర్‌ పల్లవి, టీడీపీ నేతలు జయచంద్రారెడ్డి, పర్వీనతాజ్‌ లు పేర్కొన్నారు. శనివారం బి.కొత్తకోటలో నిర్వహించిన స్వచ్చదివస్‌ ర్యాలీలో వీరు పాల్గొన్నారు. కార్యక్రమంలో తహశీల్దార్‌ మహమ్మద్‌అన్సారీ, నగరపంచాయతీ ఏఓ రమాదేవి పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

కలికిరిలో: ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి మూడవ శనివారం పంచాయతీ పరిధిలో ఆంధ్ర స్వచ్ఛ దివస్‌ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా నిర్వహించడం జరుగుతుందని కలికిరి మేజర్‌ పంచాయతీ కార్యదర్శి అశోక్‌ వెల్లడించారు. శనివారం జరిగిన ఈ కార్యక్రమం సందర్భంగా పంచాయతీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ప్రత్యేక అధికారి జయప్రకాష్‌, ఎంపీడీవో భానుమూర్తి, అధికారులు పాల్గొన్నారు.

పెద్దతిప్పసముద్రంలో : గ్రామాలను అత్యంత పరిశుభ్రంగా తీర్చి దిద్దడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరు పని చేద్దామని ఎంపీడీవో అబ్దుల్‌ కలాం ఆజాద్‌ పేర్కొన్నారు. స్వఛ్చ ఆంద్ర - స్వఛ్చ దివస్‌ కార్యక్రమంలో భాగంగా శనివారం మండల స్థాయి అధికారులు,ప్రజాప్రతినిధులు, వెలుగు సంఘాలకు చెందిన మహిళలు, అంగనవాడీ కార్యకర్తలు, కార్యాలయ సిబ్బందితో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో అన్ని శాఖల అదికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

వాల్మీకిపురంలో: స్వచ్చత-శుభ్రత విషయంలో ప్రజలందరూ బాధ్యతగా వ్యవహరిం చాలని వాల్మీకిపురం ఎంపీడీవో మనోహర్‌రాజు పేర్కొన్నారు. స్వచ్చ ఆంధ్ర, స్వచ్చ దివాస్‌లో భాగంగా శనివారం వాల్మీకిపురంలో అవగాహన ర్యాలీ చేపట్టారు. అనంతరం స్థానిక గాంధీ బస్టాండ్‌ వద్ద మానవహారంగా ఏర్పడి ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో డ్వాక్రా మహిళలు, తదితరులు పాల్గొన్నారు.

రామసముద్రంలో: రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్చ ఆంధ్రప్రదేశ, స్వచ్చ దివస్‌ కార్యక్రమం శనివారం మండలంలో ముమ్మరంగా జరిగింది. ఈ సందర్భంగా అధికారులు, సచివాలయ సిబ్బంది, పారిశుధ్య కార్మికులు మండల కార్యాలయం నుంచి ర్యాలీగా వెళ్లి అంబేడ్కర్‌ సర్కిల్‌లో మానవహారం నిర్వహించారు. కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Jan 18 , 2025 | 11:58 PM