సీజ్ చేసిన బోరు ఓపెన
ABN , Publish Date - Jan 16 , 2025 | 11:28 PM
ప్రభుత్వ భూమిలో అక్రమంగా బోరు తవ్వి నీటిని ప్రైవేటు వ్యక్తులకు విక్రయిస్తున్నారని సీఎంవోకు ఫిర్యాదు చేయ డం స్పందించిన అధికారులు బోరు సీజ్ చేశారు.

యథావిధిగా నీటిసరఫరా సీఎంవో ఫిర్యాదుపై స్పందన ఉన్నా అధికారులు ఎందుకు పట్టించుకోలేదంటున్న వైనం
మదనపల్లె, జనవరి 16(ఆంధ్రజ్యోతి): అనంతరం ఆ నివేదికను ప్రభుత్వానికి పంపడంతోపాటు ఫిర్యాదు దారునికి కూడా బోరు సీజ్ చేసిన ట్లు సమాధానం ఇచ్చి అతని నుంచి సంతకాలు కూడా తీసుకున్నారు. అంత వరకూ బాగానే ఉన్నా..తర్వాత చూస్తే అదే బోరు యఽథావిఽధిగా పనిచేస్తు న్నా..అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదు. దీనిపై ఇలా ఎందుకు జరుగుతోందంటూ జనం అసంతృప్తి అసహనం వ్యక్తంచేస్తున్నారు. వివరాల్లోకి వెళితే...మదనపల్లె మండలం బసినికొండ-2 పంచాయతీ మొలకలదిన్నె రోడ్డు లో ఓ వ్యక్తి షెడ్డు నిర్మించి, ప్రభుత్వ భూమిలో బోరు వేసి నీటిని వాడుకుం టున్నట్లు స్థానికులతో కలసి అదే పంచాయతీకి చెందిన టీడీపీ సీనియర్ నేత గంగారపు బాబురెడ్డి, గతేడాది సెప్టెంబరులో ఫిర్యాదు చేశారు. దీనిపై పంచా యతీ కార్యదర్శి, ఎంపీడీవోలు నవంబరు 22న క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టారు. గంగమ్మగుడి ఏరియాకు చెందిన కె.చలపతి, రస్తా పొరంబోకులో బోరు వేసి నీటిని పొలానికి వాడుకుంటున్నారని గుర్తించారు. పైపు లైన కనె క్షన కట్ చేసి, బోరు పంచాయతీ స్వాధీనం చేసుకుందని వారు పేర్కొన్నారు. అలాగే బోరు నీటిని ల్యాబ్ టెస్టింగ్‌కు పంపి, నీటిని గ్రామ పంచాయతీ ప్రజలకు సరఫరా చేస్తామని, బాబురెడ్డికి ఇచ్చిన సమాధానం రూపంలో ఇచ్చిన ఎండార్సుమెంట్‌లో పేర్కొన్నారు. సీఎంవో ప్రజాపరిష్కార వేదికకు ఇచ్చే స్పందన ఇలాగేనా అంటూ స్థానికులు వాపోతున్నారు. బోరు సీజ్ చేసిన ఎంపీడీవో, తిరిగీ ఎలా ఓపెన చేశారో చెప్పాలని, దీనికి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని టీడీపీ నేత కోరుతున్నారు.