అంగనవాడీల సమస్యలు పరిష్కరించాలి
ABN , Publish Date - Feb 17 , 2025 | 11:36 PM
రాష్ట్రంలో పెరుగుతున్న నిత్యా వసర వస్తువుల ధరలకు అనుగుణంగా అంగనవాడీల వేతనాలు పెంచా లని అంగనవాడీ అసోసియేషన నాయకురాళ్లు ప్రభుత్వాన్ని కోరారు.

మదనపల్లె టౌన, ఫిబ్రవరి 17(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పెరుగుతున్న నిత్యా వసర వస్తువుల ధరలకు అనుగుణంగా అంగనవాడీల వేతనాలు పెంచా లని అంగనవాడీ అసోసియేషన నాయకురాళ్లు ప్రభుత్వాన్ని కోరారు. ఆ మేరకు సోమవారం స్థానిక ఐసీడీఎస్ కార్యాలయం ఎదుట అంగనవాడీ అసోసియేషన ఆధ్వర్యంలో సీఐటీయూ నాయకులు ధర్నా నిర్వహించారు. గత ఐదేళ్లుగా అంగనవాడీలకు వేతనాలు పెంచలేదని దీనిపై 42 రోజులు సమ్మె నిర్వహిస్తే అప్పటి ప్రభుత్వం అంగీకరించినా, ప్రభుత్వాలు మారినా తమ సమస్య పరిష్కారం కాలేదన్నారు. రాష్ట్రంలోని మినీ సెంటర్లను మె యిన సెంటర్లుగా మార్చాలని, హెల్పర్ల ప్రమోషన్లకు నిర్ధిష్టమైన గైడ్‌లైన రూపొందించి అమలు చేయాలన్నారు. అంగనవాడీ అసోసియేషన నాయ కురాలు మధురవాణి, సీఐటీయూ నేత హరీంద్రనాథ్‌శర్మ, పాల్గొన్నారు.
వాల్మీకిపురంలో: వాల్మీకిపురం ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని అంగనవాడీ మహిళా కార్యకర్తలు సోమవారం స్థానిక ప్రాజెక్టుట కార్యాలయం ఎదుట ధర్నా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. కనీస సమస్యలను ప్రభుత్వం దృష్టి సారించి పరిష్కరించాలని నినాదాలు చేశారు. ఈసందర్భంగా అంగనవాడీ లు మాట్లాడుతూ కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలని గ్రాట్యుటి అమలు చేయాలని, రాష్ట్రంలో ఉన్న మొత్తం మినీ సెంటర్లలో మార్పు చేస్తూ తక్ష ణం జీవో ఇవ్వాలని సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరారు. పెం డింగ్‌లో ఉన్న సెంటర్ల అద్దెలు, టీఏ బిల్లులు వెంటనే ఇవ్వాలని అన్ని యాఫ్‌లను కలిపి ఒకే యాప్‌గా మార్పు, పెండింగ్‌లో ఉన్న 164 సూపర్ వైజర్ పోస్టుల భర్తీ, ఉచితంగా గ్యాస్ సరఫరా తదితర డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. అంతేకాకుండా జిల్లా వ్యాప్తంగా ఈకేవైసీని తిరస్కరిస్తున్నామని తాము ఎవరూ చేయబోమన్నారు. అనంతరం సీడీపీవో భారతికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో వాల్మీకిపురం ప్రాజెక్టు సీఐటీయూ అధ్యక్షురాలు చంద్రావతి, యూనియన సభ్యులు భూకైలేశ్వరి, గులాబ్‌జాన, పార్వతి, పద్మశ్రీ, నరసమ్మ, అమ్మాజీ, వివిధ మండలాల అంగనవాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.
తంబళ్లపల్లెలో: అంగనవాడీ వర్కర్లకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వ డంతో పాటుగా గ్రాట్యూటీ అమలు చేయాలని అంగనవాడీ వర్కర్లు డిమాండ్ చేశారు. సోమవారం ఏపీ అంగనవాడీ వర్కర్స్, హెల్పర్స్ యూని యన(సీఐటీయూ) ఆధ్వర్యంలో వారి సమస్యలను పరిష్కరించాలని కోరు తూ స్థానిక ఐసీడీఎస్ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..రాష్ట్రంలో ఉన్న మినీ అంగన్వాడీ సెంటర్లను మెయిన సెంటర్లుగా మార్చుతూ జోవో ఇవ్వాలన్నారు. హెల్పర్ల ప్రమోషన్లకు నిర్దిష్టమైన గైడ్‌లైన్స రూపొందించి అమలు చేయాలన్నారు. సాధికార సర్వేలో అంగనవాడీలు ప్రభుత్వ ఉద్యోగులు అన్న పదం తొలగిం చి, సంక్షేమ పథకాలను అమలుచేయాలన్నారు. అనంతరం ఐసీడీఎస్ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ ఓబుల్‌రెడ్డికి వినతిపత్రం అందచేశారు. కార్యక్రమంలో అంగనవాడీ వర్కర్లు గౌరి, కరుణశ్రీ, సులోచన, స్వరూపా రాణి, వసంతమ్మ తదితరులు పాల్గొన్నారు.
బి.కొత్తకోటలో: తమ డిమాండ్ల పరిష్కారం కోరుతూ బి.కొత్తకోట ఐసీడీఎ స్ కార్యాలయం ఎదుట అంగనవాడీ కార్యకర్తలు సోమవారం ధర్నా చేశారు. ప్రాజెక్ట్ పరిధిలోని ములకలచెరువు, పీటీయం, బి.కొత్తకోట మండ లాలకు చెందిన అంగనవాడీ వర్కర్లు సీడీపీవో కార్యాయం ఎదుట బైఠా యించి వేతనాలు పెంచాలని, గ్యాడ్యుటీ అమలు చేయాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా యూనియన లీడర్లు మాట్లాడుతూ తమ సమ స్యల పరిష్కారం కోసం 42రోజుల పాటు సమ్మె చేశామని అప్పట్లో 2024 జూలైలో వేతనాలు పెంచుతామని మినిట్స్ ఇచ్చినా అమలు కాలేదన్నారు. అధికారంలోకి కాగానే అంగనవాడీల సమస్యలు తీర్చుతామని హామీఇచ్చిన టీడీపీ నాయకులు తమహామీని నిలుపుకోవాలన్నారు. ఆమేరకు ఐసీడీఎస్ కార్యాలయంలో సంబంధిత అధికారులకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో మూడు మండలాల అంగన్వాడీ వర్కర్లు పాల్గొన్నారు.