Share News

వైభవంగా రాజ గోపురం ప్రతిష్ఠోత్సవాలు

ABN , Publish Date - Jan 30 , 2025 | 11:48 PM

తంబళ్లపల్లె మండలం కోసువారి పల్లెలో కొలువైన ప్రసన్న వేంకటరమణ స్వామి ఆలయ రాజ గోపురం ప్రతిష్ఠ మహోత్సవాలు టీటీడీ ఆధ్వర్యంలో వైభవంగా జరుగుతున్నాయి.

వైభవంగా  రాజ గోపురం ప్రతిష్ఠోత్సవాలు
ఆలయ రాజ గోపుర కళశాలను జలాధివాసంకు తీసుకువెళ్తున్న టీటీడీ వేదపండితులు

తంబళ్లపల్లె, జనవరి 30(ఆంధ్రజ్యోతి): తంబళ్లపల్లె మండలం కోసువారి పల్లెలో కొలువైన ప్రసన్న వేంకటరమణ స్వామి ఆలయ రాజ గోపురం ప్రతిష్ఠ మహోత్సవాలు టీటీడీ ఆధ్వర్యంలో వైభవంగా జరుగుతున్నాయి. గురువారం తెల్లవారుజామున వేదపండితులు స్వామి వారిని సుప్రభా త సేవతో మేల్కొలిపి దూపదీప నైవేద్యాలతో నిత్య కైంకర్యాలు పూర్తి చేశారు. అనంతరం ఆగమ అడ్వైజర్‌ శ్రీనివాసాచార్యులు ఆధ్వర్యంలో వేదపండితులు హోమాలు నిర్వహించారు. సాయంత్రం ఆలయ రాజ గోపురంపై ప్రతిష్ఠించబోయే కళశాలకు అభిషేకాలను శాసో్త్రక్తంగా నిర్వ హించి జలాధివాసం చేశారు. మండల ప్రజలు పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామి వారిని దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు.

Updated Date - Jan 30 , 2025 | 11:48 PM