Share News

మిన్నంటిన టీడీపీ సంబరాలు

ABN , Publish Date - Aug 14 , 2025 | 11:32 PM

వైఎస్‌ కుటుంబానికి కంచుకోటగా నిలిచిన పులివెందులలో టీడీపీ విజయఢంకా మోగిం చడం, పులివెందుల ప్రజల తీర్పు జగన్‌కు చెంపపెట్టు అని తంబళ్లపల్లె నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి దాసరిపల్లి జయచంద్రారెడ్డి అన్నారు.

మిన్నంటిన టీడీపీ సంబరాలు
ములకలచెరువులో విలేకరులతో మాట్లాడుతున్న ఇన్‌చార్జి జయచంద్రారెడ్డి

పులివెందుల ప్రజలకు ముందే స్వాతంత్య్రం వచ్చింది

గ్రామ గ్రామానా బాణసంచా పేళుల్లు

కేక్‌లను కట్‌ చేయించిన నేతలు

ప్రజల తీర్పు జగన్‌కు చెంపపెట్టు

సుపరిపాలనలకు ప్రజలు ఓట్లేశారు : తంబళ్లపల్లె టీడీపీ ఇన్‌చార్జి జయచంద్రారెడ్డి

ములకలచెరువు, ఆగస్టు 14(ఆంధ్రజ్యోతి): వైఎస్‌ కుటుంబానికి కంచుకోటగా నిలిచిన పులివెందులలో టీడీపీ విజయఢంకా మోగిం చడం, పులివెందుల ప్రజల తీర్పు జగన్‌కు చెంపపెట్టు అని తంబళ్లపల్లె నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి దాసరిపల్లి జయచంద్రారెడ్డి అన్నారు. పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించడం తో గురువారం నేతలు, కార్యకర్తలతో కలిసి సంబరాలు చేసుకున్నారు. భారీ ఎత్తున బాణ సంచా పేల్చి కేక్‌ను కట్‌ చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ పులివెందుల ప్రజ లకు ఒక రోజు ముందే స్వాతంత్య్రం వచ్చింద న్నారు. జగన్‌పై ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందో పులివెందుల తీర్పే నిదర్శనమన్నారు. 30 ఏళ్ల తరువాత ప్రజాస్వామ్యబద్ధంగా జరిగి న ఎన్నికల్లో ప్రజలు ముఖ్యమంత్రి చంద్రబా బునాయుడు సుపరిపాలనకు ఓట్లేశారన్నారు. పులివెందులలో వైసీపీ అభ్యర్థికి డిపాజిట్‌ కూడా ఇవ్వకుండా తగిన బుద్ధి చెప్పారన్నారు. గతంలో జరిగిన జడ్పీటీసీ, ఎంపీటీసీలు, సర్పంచుల ఎన్నికల్లో పోలీసులను అడ్డుపెట్టు కుని టీడీపీ నేతల నామినేషన్లు చించి


రౌడీ యిజం చేసి దౌర్జన్యంగా ఏకగ్రీవం చేసుకున్న విషయం ప్రజలు ఇంకా మరిచిపోలేదన్నారు. రానున్న స్థానిక సంస్థలు, పంచాయతీ ఎన్నిక లు జరిపి టీడీపీ జెండా రెపరెపలాడిస్తామ న్నారు. టీడీపీ జిల్లా కార్యదర్శి యర్రగుడి సు రేష్‌, మార్కెట్‌ కమిటీ మాజీ వైస్‌ చైర్మన్‌ ర మణ, నేతలు తులసీధర్‌నాయుడు, గంజి మో హన, ప్రభాకర్‌రెడ్డి, సుబ్బ నాయుడు, కట్టా హరినాధ్‌, నాగిరెడ్డి, పాస్టర్‌ శ్రీనివాసులు, రమ ణారెడ్డి, నీలకంఠారెడ్డి, శంకర పాల్గొన్నారు.

NPL.gifనిమ్మనపల్లి బస్టాండులో బాణసంచాపేల్చి...

బీటలు బారిన జగన్‌ కోట...

నిమ్మనపల్లి, ఆగస్టు 14(ఆంధ్రజ్యోతి): జగన్‌ కంచుకోటకు బీటలుబారాయని క్లస్టర్‌ ఇన్‌చార్జి మునిరత్నం అన్నారు. పులివెందుల జడ్పీటీసీకి డిపాజిట్టు కూడా రాకపోవడం, ఒంటిమిట్ట జడ్పీటీసీ సానాల్లో టీడీపీ విజభేరి మోగిచడంతో టీడీపీ నేతలు బస్టాండులో బాణసంచాపేల్చి సంబరాలు చేసుకున్నారు. పులివెందుల ప్రజలు స్వేచ్ఛ కోరుకుని స్వచ్ఛ దంగా ఓటు వేసి టీడీపీకి పట్టంకట్టినట్లు తెలి పారు. రాబోయే ఎన్నికలకు ఇది పునాదిలాం టిదని తెలిపారు. యవత అఽధ్యక్షుడు చినబా బు, విజయ్‌, మురళి, సూర్యప్రకాష్‌, రాజన్న, చండ్రాయుడు, లక్ష్మన్న, భూపతి పాల్గొన్నారు.

గుర్రంకొండలో సంబరాలు

గుర్రంకొండ, ఆగస్టు 14(ఆంధ్రజ్యోతి): పులి వెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికల్లో టీడీ పీ విజయం సాధించడంతో గుర్రంకొండలో టీడీపీ నేతలు సంబరాలు చేసుకున్నారు. బస్టాండులో బాణసంచా పేల్చారు.


కార్యక్ర మంలో నేతలు జగదీష్‌, చంద్రబాబు, చలమా రెడ్డి, నౌషాద్‌అహ్మద్‌, సుధాకర్‌, మహాత్మారెడ్డి, సాగర్‌, రామయ్య తదితరులు పాల్గొన్నారు.

TDPతంబళ్లపల్లెలో బాణసంచా పేల్చి సంబరాలు చేసుకుంటున్న టీడీపీ శ్రేణులు

దద్దరిల్లిన హరిత కూడలి

తంబళ్లపల్లె, ఆగస్టు 14(ఆంధ్రజ్యోతి): పులివెం దుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు ఘన విజయం సాధించడం తో టీడీపీ శ్రేణులు విజయోత్సవ సంబరాలు చేసుకున్నారు. పట్టణంలోని హరిత కూడలి వద్ద పెద్ద ఎత్తున బాణసంచా పేల్చి ప్రజలకు స్వీట్లు పంచిపెట్టారు. ప్రభుత్వ పాలనను ప్ర జలు మెచ్చి ఇచ్చిన తీర్పు పులివెందుల జడ్పీ టీసీ గెలుపన్నారు. ఈ విజయం ముమ్మాటికీ అభివృద్ధిని కోరుకునే ప్రజలదని, అభివృద్ధికి అడుగులు నేర్పుతున్న టీడీపీదే అన్నారు. టీడీ పీ మాజీ మండలాధ్యక్షుడు ఉత్తమ్‌రెడ్డి, మల్ల య్యకొండ మాజీ చైర్మన్‌ గంగుల్‌రెడ్డి, జడ్పీ టీసీ మాజీ సభ్యుడు రామచంద్ర, ఎస్‌ఎంసీ చైర్మన్లు వీరాంజనేయులు, శివ, నరేంద్ర నా యుడు, కాలా నారాయణ, సుధాకర్‌రెడ్డి, వార్డు సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

పరిఢవిల్లిన ప్రజాస్వామ్యం

పీలేరు, ఆగస్టు 14(ఆంధ్రజ్యోతి): పులివెందు లలో ప్రజాస్వామ్యం పరిఢవిల్లిందని జిల్లా టీడీపీ అధికార ప్రతినిధి కోటపల్లె బాబు రెడ్డి అన్నారు. పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు అపూర్వ విజ యం సాధించడంతో పీలేరులోని టీడీపీ శ్రేణు లు ఘనంగా సంబరాలు చేసుకున్నాయి. టీడీ పీ నేతలు స్వీట్లు పంచడమే కాక బాణ సం చా పేల్చి తమ హర్షం వ్యక్తం చేశారు.


వైసీపీ అధికారంలో ఉండగా స్థానిక సంస్థల ఎన్నికల కోసం వైసీపీ నేతలు సాగించిన దమ నకాండ రాష్ట్ర ప్రజలు మరిచిపోలేదన్నారు. టీడీపీ అధి కారంలో ఉన్నప్పటికీ ఎటువంటి అక్రమాలు, దౌర్జన్యాలకు పాల్పడకుండా ప్రజా స్వామ్య బద్ధంగా ఎన్నికలు నిర్వహించి స్పష్ట మైన ఓటరు తీర్పుతో రెండు జడ్పీటీసీ స్థానాలను కైవశం చేసుకుందన్నారు. కార్యక్రమంలో పీలే రు ఏఎంసీ అధ్యక్షులు పురం రామ్మూర్తి, డైరెక్టర్‌ పఠాన్‌ రహంతుల్లా, నేతలు పోలిశెట్టి సురేంద్ర, నాగేంద్ర, ఖాదర్‌, చంద్రమ్మ, సలీం, తదితరులు పాల్గొన్నారు.

VLK.gif

వాల్మీకిపురంలో కూటమి సంబరాలు

వాల్మీకిపురం, ఆగస్టు 14(ఆంధ్రజ్యోతి): పులివెందుల, ఒంటిమిట్టల్లో జరిగిన ఉపఎన్ని కల్లో టీడీపీ ఘనవిజయం సాధించడం పట్ల పట్టణంలో కూటమి పార్టీల ఆధ్వర్యంలో సం బరాలు చేసుకున్నారు. స్థానిక గాంధీ బస్టాండ్‌ వద్ద నేతలు, కార్యకర్తలు బాణసంచా కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు. వైసీపీకి కంచుకోటకు బీటలు బారడం టీడీపీ జయకేతనం సీఎం నారా చంద్రబాబునాయుడు సుపరిపాలనకు నిదర్శనమన్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్ర జలకు మేలు జరుగుతుందంటే అది ఒక్క చం ద్రబాబుతోనే సాధ్యమన్నారు. అనంతరం ఒక రికొకరు స్వీట్లు తినిపించుకుంటూ జైచంద్రబా బు నినాదాలతో హోరెత్తించారు. మార్కెట్‌ చైర్మన్‌ కోసూరి చంద్రమౌళి, నేతలు రాజేంద్రా చారి, పీవీ నారాయణ, బొక్కసం రామకృష్ణ, జాఫర్‌, చాను, రామాంజులరెడ్డి, డిష్‌ బ్రదర్స్‌, రామచంద్ర, కాలనీ రమేష్‌, ఆదినారాయణ, శివారెడ్డి, గంగులప్ప, దండువారిపల్లె రమణ, రామకృష్ణ, నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.


టీడీపీ శ్రేణుల సంబరాలు

కలకడ, ఆగస్టు 14(ఆంధ్రజ్యోతి): పులివెందు ల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు ఘనవిజయం సాధించడంతో ఆపా ర్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. కలకడ లో పార్టీ జెండాను ప్రదర్శిస్తూ మిఠాయిలను పంచారు. గెలుపుపొందిన అభ్యర్థులు మారెడ్డి లతారెడ్డి, ముద్దుక్రిష్ణారెడ్డికి శుభాకాంక్షలు తెలి పారు. కార్యక్రమంలో నేతలు వై.జిలానీ, ముబారక్‌అలీ, నౌషాద్‌, ఇర్ఫాన్‌, ఖాజా, జాఫ ర్‌, మహ్మద్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 14 , 2025 | 11:33 PM