ఈఆర్‌వో కార్యాలయ తరలింపును ఆపాలి
ABN , Publish Date - Jan 17 , 2025 | 11:33 PM
వాల్మీకిపురంలో గత 40 ఏళ్లు గా ఉంటున్న ఉపవిద్యు త రెవెన్యూ కార్యాలయాన్ని కలికిరికి తరలిం చడం మంచిది కాదని వెంటనే నిలుపుదల చేయాలని వాల్మీకిపురం యువత డిమాండ్ చేసింది.

ట్రాన్సకో ఏఏవో బ్రహ్మయ్య ఆచారికి వినతిపత్రం ఇస్తున్న వాల్మీకిపురం యువత
వాల్మీకిపురం, జనవరి 17(ఆంధ్ర జ్యోతి):వాల్మీకిపురంలో గత 40 ఏళ్లు గా ఉంటున్న ఉపవిద్యు త రెవెన్యూ కార్యాలయాన్ని కలికిరికి తరలిం చడం మంచిది కాదని వెంటనే నిలుపుదల చేయాలని వాల్మీకిపురం యువత డిమాండ్ చేసింది. శుక్రవా రం ట్రాన్సకో ఏఏవో బ్రహ్మయ్య ఆ చారిని కలిసి వారొక వినతిపత్రం అంద జేశారు. ఈసందర్భంగా ఆరు మాట్లాడుతూ ఈఆర్‌వో కార్యాలయాన్ని స్థానికం గా లేకుండా కలికిరికి తరలిస్తే ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతారన్నారు. వాల్మీ కిపురం, గుర్రంకొండ మండలాలకు అనుకూలంగా ఉండే ఈఆర్‌వో కార్యాలయాన్ని స్థానికంగా లేకుండా కలికిరికి తరలిస్తే అసౌకర్యంగా ఉంటుందన్నారు. ఈ విషయ మై స్పందించిన ఏఏవో బ్రహ్మయ్య ఆచారి మాట్లాడుతూ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి సమస్యను తీసుకెళతానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో వాల్మీకిపురం యువత సాదివక్, అషర్, ఇర్ఫాన, యూనిష్, నాయకులు కువైట్ సయ్యద్‌బాషా, హనీఫ్ తదితరులు పాల్గొన్నారు.