Share News

భూసమస్యల పరిష్కారానికి చర్యలు

ABN , Publish Date - Jan 17 , 2025 | 11:29 PM

రెవెన్యూ సదస్సులలో వివిధ భూస మస్యలపై రైతులు నుంచి అందిన అర్జీల పరిష్కారానికి అధిక ప్రాధాన్యమి స్తున్నట్లు మదనపల్లె సబ్‌కలెక్టర్‌ మేఘస్వరూప్‌ పేర్కొన్నారు.

భూసమస్యల పరిష్కారానికి చర్యలు
గోళ్లపల్లెలో ఓ భూసమస్యపై విచారిస్తున్న సబ్‌కలెక్టర్‌ మేఘస్వరూప్‌

బి.కొత్తకోట, జనవరి 17(ఆంధ్రజ్యోతి): రెవెన్యూ సదస్సులలో వివిధ భూస మస్యలపై రైతులు నుంచి అందిన అర్జీల పరిష్కారానికి అధిక ప్రాధాన్యమి స్తున్నట్లు మదనపల్లె సబ్‌కలెక్టర్‌ మేఘస్వరూప్‌ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన బి.కొత్తకోట మండల పరిధిలోని గోళ్లపల్లె పంచాయతీలో పర్య టించారు. ఈ సందర్భంగా రెవెన్యూ సదస్సు అర్జీలు, రీసర్వేలో ఎల్పీ నం బర్ల కేటాయింపులలో భాగంగా కొన్ని భూములను పరిశీలించి సిబ్బందికి తగు సూచనలు ఇచ్చారు. అనంతరం బి.కొత్తకోట తహశీల్దార్‌ కార్యాల యంలో రీస ర్వే, రెవెన్యూసదస్సు అర్జీలపై సిబ్బందితో సబ్‌కలెక్టర్‌ సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ రెవెన్యూ సమస్యల పరిష్కారం కోరుతూ 3500 అర్జీలు వచ్చాయని వాటిలో బి.కొత్తకో ట, మదనపల్లెల నుంచి అత్యధికంగా ఉన్నాయన్నారు. ఫ్రీహోల్డ్‌ భూముల వెరిఫికేషన సాగుతోందని 45 రోజుల గడువు పూర్తి అయినం దున ప్రభుత్వం మరో 45 రోజులు పొడిగించిందన్నారు. రీ వెరిఫికేషనలో 35శాతం మిగిలి ఉందన్నారు. ఈనెల 20 నుంచి భూముల రీవెరిఫికేషన ప్రారంభిస్తున్నామన్నారు. స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా చేప ట్టాల్సిందిగా మండల అధికారులకు, మున్సిపల్‌ ఛైర్మనలను ఆదేశించామ న్నారు. పర్యాటక కేంద్రం హార్సిలీహిల్స్‌ అభివృద్ధిపై యాక్షనప్లాన రూపొంది స్తున్నామన్నారు. ఫైల్స్‌ దహనం కేసు వల్ల రికార్డులను కోల్పోయామని, రిక వరీ చర్యలు చేపడుతున్నా మన్నారు. త్వరలో టౌనషిప్‌ కమిటీ సమావేశం నిర్వహిస్తామని. విజిలెన్సను నియమించి హిల్స్‌పై పారిశుఽధ్యం మెరుగున కు చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. రేషనషాపుల డీలర్ల ఎంపిక ఈ నెలాఖరుకు పూర్తిచేసి ఫిబ్రవరి మొదటివారంలో నియామక ఉత్తర్వులు ఇవ్వడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో తహశీల్దార్‌ మహ మ్మద్‌అన్సారీ, ఆర్‌ఐ వీరాంజినేయులు, వీఆర్వో నాగేంద్ర పాల్గొన్నారు.

Updated Date - Jan 17 , 2025 | 11:29 PM