మదనపల్లె సబ్‌కలెక్టరేట్‌లో ప్రత్యేక పూజలు
ABN , Publish Date - Feb 08 , 2025 | 11:58 PM
మదనపల్లె సబ్‌కలెక్టరేట్‌లో సబ్‌కలె క్టర్ మేఘస్వరూప్ ప్రత్యేక పూజలు నిర్వ హించారు.

శాంతి హోమంలో పాల్గొన్న సబ్‌కలెక్టర్
మదనపల్లె టౌన, ఫిబ్రవరి 8(ఆంధ్రజ్యో తి): మదనపల్లె సబ్‌కలెక్టరేట్‌లో సబ్‌కలె క్టర్ మేఘస్వరూప్ ప్రత్యేక పూజలు నిర్వ హించారు. శనివారం ఉదయం సాంప్ర దాయ దుస్తుల్లో సబ్‌కలెక్టర్ మేఘస్వ రూప్ ఆధ్వర్యంలో అర్చకులు శాంతిహో మం నిర్వహించారు. గత ఏడాది జూలై 21వ తేదీన మదనపల్లె సబ్‌కలెక్టరేట్‌లో అగ్నికి పలు కీలక పైళ్లు దహనమై, ఫర్నీచర్ ఆస్తినష్టం జరిగిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి సబ్‌కలెక్టరేట్ కార్యకలాపాలు, పాలన అంతా హెచఎనఎస్ కార్యాలయం నుంచే జరుగుతోంది. ఈ క్రమంలో రెండు నెలలుగా సబ్‌కలెక్టరేట్‌లో కాలిపోయిన వస్తువులను తొలగించి, నూతన ఫర్నీచర్ ఏర్పా టు, కోర్టు హాలు, సబ్‌కలెక్టర్ చాంబర్, ఏవో చాంబర్‌తో పాటు కొత్తగా రంగులు వేసి సిద్ధం చేస్తున్నారు. ఎక్కడ కూడా రాజీ పడకుండా అన్ని విభాగాలను మరమ్మతులు చేయించి సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలో సబ్‌కలెక్టరేట్‌లో శాంతిహోమం నిర్వహిం చారు. ఈనెల 15 తర్వాత సబ్‌కలెక్టరేట్ పునః ప్రారంభించనున్నట్లు తెలిసింది.