రోడ్డు నిబంధనలు పాటించాలి
ABN , Publish Date - Jan 17 , 2025 | 11:33 PM
ఆర్టీసీ డ్రైవర్లు రోడ్డు భద్రతా నియమాలు తప్పకుండా పాటించాలని మోటారు వెహికల్ ఇనస్పెక్టరు బీవీ ప్రసాద్, ఆర్టీసీ డిపో మేనేజరు రామక్రిష్ణ సూచించారు.

రోడ్డు ప్రమాదాల నివారణపై ఆర్టీసీ ప్రత్యేక దృష్టి: ఎంవీఐ
పులివెందుల టౌన, జనవరి 17 (ఆంధ్రజ్యోతి) : ఆర్టీసీ డ్రైవర్లు రోడ్డు భద్రతా నియమాలు తప్పకుండా పాటించాలని మోటారు వెహికల్ ఇనస్పెక్టరు బీవీ ప్రసాద్, ఆర్టీసీ డిపో మేనేజరు రామక్రిష్ణ సూచించారు. రోడ్డుభద్రతా వారోత్సవాల సందర్భంగా శుక్రవారం పట్టణంలోని ఆర్టీసీ డిపోలో డ్రైవర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోడ్డు నిబంధనలు పాటి స్తూ ఎలాంటి ప్రమాదాలు జరగకుండా డ్రైవ ర్లు బస్సులను జాగ్రత్తగా నడపాలన్నారు. డ్రైవింగ్ చేసేటప్పుడు సెల్‌ఫోన్లు ఉపయోగించరాదని, ఇతరులతో మాట్లాడరాదని సూచించారు. ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాలన్నారు. భద్రత గురించి ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అవసరంఎంతైనా ఉందన్నారు. ఎవరికి వారు భద్ర తా చర్యలు పాటిస్తే ప్రమాదాలు జరగవని తెలిపారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా బ స్సు డ్రైవర్లు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నా రు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. రోడ్డు ప్రమాదాలను అరికట్టేదిశగా డ్రైవర్లకు పీరియడ్ ఆర్టికల్ మెడికల్ టెస్టులు, నూతన బస్సు టెక్నాలజీపై శిక్షణ తరగతులు నిర్వహిస్తామన్నారు. రోడ్డు ప్రమాదాలు చాలా వరకు నిర్లక్ష్యంగా ఓవర్‌ట్రాక్ చేయడం, మలుపుల వద్ద అధిక వేగంతో నడపడం, డ్రైవర్ల కంటిచూపు సరిగా లేకపోవడం వంటి కారణాల వల్ల జ రుగుతున్నాయన్నారు. జాగ్రత్తలు పాటిస్తే ప్ర మాదాలను నివారించవచ్చన్నారు. ప్రమాదాల నివారణకు తీసు కోవాల్సిన చర్యలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంఎఫ్ శ్రీకాంత, ఎస్పీఐ కుళ్లాయప్ప, ఎస్‌బీఐ గోపాల్‌రెడ్డి, ఆర్టీసీ డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు.