ఆప్కాస్ రాష్ట్ర కార్యదర్శిగా రిమ్స్ ఉద్యోగి
ABN , Publish Date - Jan 25 , 2025 | 12:01 AM
ఆప్కాస్ ఔట్‌సోర్సింగ్ ఎంప్లాయిస్ ఫెడరేషన రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కడప ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో పనిచేస్తున్న పి.వెంకటసుబ్బయ్యను ఎన్నుకున్నట్లు ఆయన తెలిపారు.

కడప సెవెన రోడ్స్, జనవరి 24 (ఆంధ్రజ్యోతి): ఆప్కాస్ ఔట్‌సోర్సింగ్ ఎంప్లాయిస్ ఫెడరేషన రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కడప ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో పనిచేస్తున్న పి.వెంకటసుబ్బయ్యను ఎన్నుకున్నట్లు ఆయన తెలిపారు. ఆప్కాస్ ఔట్‌సోర్సింగ్ ఎంప్లాయిస్ ఫెడరేషన రాష్ట్ర కమిటీ సమావేశం శుక్రవారం విజయవాడలో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఆప్కాస్ ఔట్‌సోర్సింగ్ ఎంప్లాయిస్ ఫెడరేషన రాష్ట్ర గౌరవాధ్యక్షుడు ఏవి నాగేశ్వరరావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సదర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న ఆప్కాస్ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులందరికి తక్షణం ఎంటీఎ్‌సను అమలు చేయాలన్నారు.