Share News

వృథాగా పోతున్న రెడ్డిచెరువు నీరు

ABN , Publish Date - Jan 17 , 2025 | 11:38 PM

చింతకొమ్మదిన్నె మండలం రెడ్డిచెరువు నీరు వృథాగా పోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు పేర్కొంటున్నారు.

వృథాగా పోతున్న రెడ్డిచెరువు నీరు
రెడ్డిచెరువు నీరు వృథాగా పోతోందని చూపుతున్న స్థానికులు

సికెదిన్నె, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): చింతకొమ్మదిన్నె మండలం రెడ్డిచెరువు నీరు వృథాగా పోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు పేర్కొంటున్నారు. గతంలో గుర్తు తెలియని వ్యక్తులు అలుగు కట్ట తెంపడంతో నీరు వృథా అవుతోందంటున్నారు. క మలాపురం ఎమ్మెల్యే ఆదేశాలతో చింతకొమ్మదిన్నె మండలం బుగ్గవంక ప్రాజెక్టు నుంచి అధికారులు రెడ్డి చెరువుకు నీరందించారు. అధికారులు అలుగు కట్టలు తిరిగి నిర్మించకపోవడంతో దాదాపు రెండు అడుగులకుపైగా నీరు చేరులో నిలువ ఉండాల్సింది ఉంది. నీటిమట్టం రాకముందే అలుగు ద్వారా నీరు వృథాగా పోతోందని రైతులు, స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు తిరిగి కట్ట నిర్మించాలని కోరుతున్నారు. అయితే డ్యాం నీరు చెరువుకు చేరి చెరువు నిండి నీరు వృథా అవుతున్నా అధికారులు పట్టించుకోలేదని రైతులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకుని చెరువు నీటిని వృథాగా పోకుండా చూడాలని, అవసరమైతే మరో చెరువుకు నీటిని నింపితే ఉపయోగం ఉంటుందని రైతులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మట్టి తోలుకునేందుకే తొలగించారు

రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు మట్టిని తరలించేందుకు అనుకూలంగా ఉంటుందని, అలుగుకట్టలు తొలగించి అనుకూలంగా చేసుకుని రెడ్డిచెరువు నుంచి మట్టిని తరలించి అమ్ముకున్నట్లు తెలుస్తోంది. దీంతో అప్పట్లో అధికారులు పట్టించుకోకపోవడంతో మట్టి అమ్మకాలు మూడు పువ్వులు ఆరు కాయలుగా సా గినట్లు స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికైనా అలుగు కట్టలు పునర్నిర్మిస్తే దాదాపు మూడు అడుగుల మేర చెరువు నీటి సా మర్థ్యం పెరిగి భూగర్జజలాలు వృద్ధి చెం దుతాయని, వేసవి కాలంలో నీటి సమస్య రాకుండా ఉం టుందని రైతులు అంటున్నారు. ఆదిశగా చ ర్యలు చేపట్టాలని కోరుతున్నారు. మరోవైపు అలుగు నుంచి నీరు పారే లింగన్న కాలువ ను కూడా ఆక్రమించుకున్నట్లు స్థానికులు చె బుతున్నారు. ఈ విషయమై ఇరిగేషన్‌ అధికా రి జగధీశ్వర్‌రెడ్డిని వివరణ కోరగా నీటి వృ థాను అరికట్టి చర్యలు చేపడతామన్నారు.

Updated Date - Jan 17 , 2025 | 11:38 PM