Share News

ప్రజాసమస్యల పరిష్కారానికే ప్రాధాన్యం

ABN , Publish Date - Feb 15 , 2025 | 11:58 PM

ప్రజా సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోం దని ఎమ్మెల్యే షాజహానబాషా పేర్కొ న్నారు.

ప్రజాసమస్యల పరిష్కారానికే ప్రాధాన్యం
ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తున్న ఎమ్మెల్యే షాజహానబాషా

మదనపల్లె టౌన, ఫిబ్రవరి 15(ఆంధ్ర జ్యోతి): ప్రజా సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోం దని ఎమ్మెల్యే షాజహానబాషా పేర్కొ న్నారు. శనివారం స్థానిక ఎమ్మెల్యే నివా సం వద్ద టీడీపీ అధిష్ఠానం ఆదేశాను సారం ఎమ్మెల్యే షాజహానబాషా పీజీ ఆర్‌ఎస్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని టీడీపీ ఎమ్మెల్యేల పనితీరుపై చంద్రబాబు ఆరా తీస్తున్నారని, ఇందులో భాగంగా ఎమ్మెల్యేలు ప్రతి వారం ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ప్రతి శని వారం ప్రజాసమస్యల పరిష్కార కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ముఖ్యంగా మున్సిపల్‌, రెవెన్యూ, పోలీసు, వైద్యశాఖ అధికారులు ఈ కార్యక్రమంలో అందుబాటు లో ఉంటూ ఎప్పటికప్పుడు చిన్నచిన్న సమస్యలు పరిష్కరిస్తామన్నారు. గత వైసీపీ ప్రభుత్వ నిర్వాకంతో మున్సిపల్‌ నిధులన్నీ సీఎంఎఫ్‌ఎస్‌ కింద వెళ్లిపోతున్నాయని, ఈ సమస్యను మార్చి నెలలో పరిష్కరిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారన్నారు. గ్రామ పంచాయతీల్లో అందుబాటులో ఉన్న నిధులతో సమస్యలు పరిష్కరిస్తున్నామన్నారు. మూడు గంటల పాటు నిర్వహించిన ఈ కార్యక్రమంలో 270 మంది పలు సమస్యలపై ఎమ్మెల్యేకు అర్జీలు అందజేశారు. వాటిని సంబంధిత అధికారులకు పంపి, సకాలంలో పరిష్కరించాలని ఎమ్మెల్యే సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ ప్రమీల, ఆర్‌ఐ శేషాద్రిరావు, సీడీపీవో సుజాత, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Feb 15 , 2025 | 11:58 PM