Share News

పేదల పెన్నిధి ఎన్టీఆర్‌

ABN , Publish Date - Jan 18 , 2025 | 11:55 PM

పేదల పెన్నిధి, తెలు గువారి ఆరాధ్యుడు, టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు వర్ధంతిని శనివారం ఘనంగా నిర్వహించారు.

పేదల పెన్నిధి ఎన్టీఆర్‌
మదనపల్లెలో ఎన్టీఆర్‌ విగ్రహానికి క్షీరాభిషేకం చేస్తున్న ఎమ్మెల్యే

ఘనంగా తెలుగుజాతి ముద్దుబిడ్డ

నందమూరి తారకరామారావు వర్ధంతి

పెద్దఎత్తున నివాళులర్పించిన టీడీపీ శ్రేణులు

మదనపల్లెలో వేర్వేరుగా కార్యక్రమాలు

ఎమ్మెల్యే ఓ వైపు, టీడీపీ సీనియర్‌

నాయకులు మరో వైపు

మదనపల్లె టౌన, జనవరి 18(ఆంధ్రజ్యోతి): పేదల పెన్నిధి, తెలు గువారి ఆరాధ్యుడు, టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు వర్ధంతిని శనివారం ఘనంగా నిర్వహించారు. టీడీపీ శ్రేణులతోపాటు ఎన్టీఆర్‌ అభిమానులు, బడుగు, బలహీన వర్గాల ప్రజలు ఈ సందర్భంగా ఎన్టీఆర్‌కు ఘనంగా నివాళులర్పించి, ఆయన సేవలను కొనియాడారు. కాగా మదనపల్లెలో టీడీపీ నాయకులు రెండు వర్గాలుగా ఏర్పడి వేర్వేరుగా ఎన్టీఆర్‌ విగ్రహాలు, చిత్రప టాల వద్ద నివాళులర్పించారు. శనివారం ఎమ్మెల్యే షాజహానబా షా ఆధ్వర్యంలో స్థానిక ఎన్టీఆర్‌సర్కిల్‌, నిమ్మనపల్లె సర్కిల్‌, మండలంలోనీ సీటీఎం గ్రామంలో ఎన్టీఆర్‌ వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించారు. కాగా టీడీపీ సీనియర్‌ నాయకులు తెలుగుయు వత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్‌చినబాబు, మాజీ ఎమ్మెల్యే దొమ్మల పాటి రమేశ తనయుడు దొమ్మలపాటి యశశ్విరాజ్‌, జనసేన రాయలసీమ కోఆర్డినేటర్‌ గంగారపు రాందాస్‌చౌదరి కలసి స్థానిక ఎన్టీఆర్‌ సర్కిల్‌ వద్ద ఎన్టీఆర్‌ విగ్రహానికి క్షీరాభిషేకం చేసి, నివాళులర్పించారు. శ్రీరామ్‌చినబాబు మాట్లాడుతూ పాత టీడీపీ నాయకులను కొంత మంది అధికారులు పట్టించుకోవడంతో లేద ని, కొత్తవారికే ప్రాధాన్యత ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు మార్పురి శశి ధర్‌రావు, దేవరింటి శ్రీనివాసులు, మేకలరెడ్డిశేఖర్‌, దొరస్వామినా యుడు, అరుణ్‌తేజ, రాజారెడ్డి, పఠానఖాదర్‌ఖాన, రెడ్డిరామ్‌ప్రసా ద్‌, చల్లా నరసింహులు, శ్రీనివాసులు, రాజు పాల్గొన్నారు.

పీలేరులో: టీడీపీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు 29వ వర్ధంతిని శనివారం పీలేరు లోని టీడీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. స్థానిక పార్టీ కార్యా లయంలో ఆయన చిత్రపటాన్ని ఆవిష్కరించి పూలమాలలతో అలంకరించి ఆయనకు శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ సంక్షేమ పథకాలు, వృద్ధాప్య పింఛన్లు, మహిళలకు ఆస్తి హక్కు, పటేల్‌ పట్వారీ వ్యవస్థల రద్దు, మండల వ్యవస్థ ఏర్పాటు వంటి విప్లవాత్మక మార్పులతో ఎన్టీఆర్‌ తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయార న్నారు. కార్యక్రమంలో నాయకులు కోటపల్లె బాబు రెడ్డి, శ్రీకాంత రెడ్డి, మల్లెల రెడ్డిబాషా, అమరనాథరెడ్డి, పురం రామ్మూర్తి, యల్లెల రెడ్డప్ప రెడ్డి, లక్ష్మీకర, పోలిశెట్టి సురేం ద్ర, స్పోర్ట్స్‌ మల్లి, షౌకత అలీ, అతార్‌ చాను, పురం రెడ్డమ్మ, రమాదేవి, లక్ష్మీకాంతమ్మ, వాణి, వీణ, స్వర్ణ, షమ, అనూరాధ పాల్గొన్నారు.

వాల్మీకిపురంలో: నిరుపేదల గుండె చప్పుడు దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు అని కూటమి నాయకులు కొనియాడారు. శనివారం వాల్మీకిపురం మండల వ్యాప్తంగా ఎన్టీఆర్‌ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. స్థానిక గాంధీ బస్టాండ్‌ కూడలిలో ఎన్టీఆర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి పూజలు చేస్తూ ఘనంగా నివాళులర్పించారు. స్థానిక బైపాస్‌ రోడ్డులోని చౌడేశ్వరిదేవి వృద్దాశ్రమంలో వృద్దులకు పండ్లు, రొట్టెలు పంపిణీ, అన్నదానాలు చేపట్టారు. ఈకార్యక్రమాలలో రాష్ట్ర కురబ కార్పొరేషన డైరెక్టర్‌ వల్లిగట్ల వెంకటరమణ, టీడీపీ మండల అధ్యక్షుడు మల్లికార్జునరెడ్డి, మాజీ ఎంపీపీ సురేంద్రవర్మ, ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు వెంకటరమణ, జిల్లా బీజేపీ ఉపాధ్యక్షుడు పులి నరేంద్రరెడ్డి. పీలేరు మైనార్టీ నాయకుడు సయ్యద్‌బాషా, పీవీ నారాయణ, రాజేంద్రాచారి, మురళి, బొక్కసం బ్రదర్‌, బీసీ మహిళా నాయకురాలు స్వర్ణలత, డిష్‌ బ్రదర్‌, పాల్గొన్నారు.

నిమ్మనపల్లెలో: టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ముఖ్యమం త్రి నందమూరి తారకరామారావు 29వ వర్థంతిని టీడీపీ మండ లాధ్యక్షుడు వెంకటరమణ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంవగా నాయకులు మాట్లాడుతూ పార్టీ ఆవిర్భావంలోనే కిలో బియ్యం రెండు రూపాయలకు ఇచ్చిన ఘనత ఎన్టీఆర్‌కే దక్కుతుందన్నారు. కార్యక్రమంలో మాజీ జడ్పీ టీసీ రెడ్డెప్పరెడ్డి, సుధాకరరావు, విజయ్‌రమణ, సుజాత శ్రీనివాసు లు, నరేంద్ర, మల్లికార్జున, రాజన్న, రెడ్డెప్ప పాల్గొన్నారు.

గుర్రంకొండలో:తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు వర్ధంతి వేడుకలను ఆ పార్టీ నాయకులు శనివారం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా బస్టాండులో ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు నాయిని జగదీష్‌కుమార్‌, మూర్తిరావు, నౌషాద్‌ అహ్మద్‌, మురళీ, చలమా రెడ్డి, చంద్రబాబు, సుంకరశేఖర్‌, చిన్నప్ప తదితరులు పాల్గొన్నారు.

కలకడలో:మాజీ సీఎం స్వర్గీయ నందమూరి తారకరామారావు వర్ధంతిని శనివారం మండల అధ్యక్షుడు పొత్తూరి ప్రభాకర్‌నాయు డు ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్‌ చిత్ర పటానికి పూల మాల వేసి నివా ళులర్పించారు. కార్యక్రమంలో రాష్ట్ర అధికారప్రతినిధి మద్దిపట్ల సూర్యప్రకాశ, మద్దిపట్ల వెంకటరమణనాయుడు, కోట రమణనా యుడు, రైస్‌మిల్‌ రమణ, మల్లికార్జుననాయుడు, వసంతనా యుడు, శేఖర్‌నాయుడులు పాల్గొన్నారు.

తంబళ్లపల్లెలో: తెలుగు జాతికి వెలుగు రేఖ నందమూరి తారకరామారావు అని తంబళ్లపల్లె నియోజకవర్గ టీడీపీ నేత దాసరిపల్లె జయచంద్రారెడ్డి, టీడీపీ సమన్వయకర్త సీడ్‌ మల్లికా ర్జుననాయుడు పేర్కొన్నారు. శనివారం తంబళ్లపల్లెలో నిర్వహించి న ఎన్టీఆర్‌ వర్ధంతి కార్యక్రమానికి జయచంద్రారెడ్డి హాజరై ఎన్టీఆర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం స్థానిక ప్రభుత్వాసుపత్రిలో రోగులకు బ్రెడ్డు, పండ్లు పంపిణీ చేశారు. ఎస్‌ఎంసీ చైర్మన సుగవాసి శివకుమార్‌, మాజీ ఉప సర్పంచ మణి, టైల్స్‌ శీన, తెలుగు యువత నరసింహులు అన్నదానం చేశారు. కార్యక్రమంలో టీడీపీ మండలాధ్యక్షుడు రెడ్డప్పరెడ్డి, ప్రధాన కార్యదర్శి కృష్ణమూర్తి నాయుడు, క్లస్టర్‌ ఇంచార్జి బేరి శ్రీనివాసులు, బీసీ నాయకుడు తులసీధర్‌ నాయు డు, బీసీ సెల్‌ కార్యనిర్వాహక కార్య దర్శి సోముశేఖర్‌, పెద్దేరు ప్రాజెక్టు చైర్మన శివకుమార్‌, ఆదిరెడ్డి పాల్గొన్నారు.

పెద్దమండ్యంలో: దివంగత, మాజీ ముఖ్యమంత్రి ఎనటీ రామారావు వర్ధంతిని శనివారం టీడీపీ శ్రేణులు ఘనంగా నిర్వ హించారు. మండల కేంద్ర మైన పెద్దమండ్యంలో తంబళ్లపల్లి నియోజకవర్గం టీడీపీ నేత దాసరిపల్లి జయచంద్రారెడ్డి ఆధ్వర్యం లో కూటమి నేతలు ఎనటీఆర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో టీడీపీ సమస్వయకర్త సీడ్‌ మల్లికార్జున నాయుడు, జిల్లా మాజీ ఉపాఽధ్యక్షుడు విశ్వనా ధరెడ్డి, మండల మాజీ అధ్యక్షు డు సిద్దవరం ప్రసాద్‌ కూటమి నేతలు గంగాధర, హసీంసాబ్‌, మహేశ్వర, సాంబ, నాగేశ్వరరెడ్డి, చంద్రారెడ్డి, కాలేషా, గల్లా నారాయణ పాల్గొన్నారు.

పెద్దతిప్పసముద్రంలో: మండల కేంద్రమైన పెద్దతిప్పసముద్రం లో ఎన్టీఆర్‌ 29వ వర్దంతిని కూటమి నాయకులు ఘనంగా నిర్వ హించారు. స్థానిక బస్టాండులో ఉదయం ఎన్టీఆర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తెలుగువారి ఆత్మ గౌరవాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన స్వర్గీయ నంద మూరి తారకరామారావు సేవలను కొనియాడారు. కార్యక్రమంలో అధిక సంఖ్యలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

కలికిరిలో: పేదల కోసమే తపించిన ఎన్టీఆర్‌కు టీడీపీ నాయకు లు ఘన నివాళులర్పించారు. శనివారం స్థానిక గాంధీ సర్కిల్‌ వద్ద ఏర్పాటు చేసిన టీడీపీ జెండా వద్ద ఎన్టీఆర్‌ చిత్రపటాన్ని ఉంచి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. నిర్వ హించారు. కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షుడు నిజాము ద్దీన, నాయకులు సహదేవ రెడ్డి, రెడ్డెప్ప రెడ్డి, నాగభూషణ రెడ్డి, చిన్నరెడ్డెయ్య, వెంకటపతి, భాస్కర్‌ రెడ్డి, అబ్దుల్‌ కాదర్‌, ముస్తఫా, మాలతి, వైజాగ్‌ బాషా, సనావుల్లా తదితరులు పాల్గొన్నారు.

బి.కొత్తకోటలో: తెలుగుదేశంపార్టీ వ్యవస్థాపకుడు, దివంగత ముఖ్యమంత్రి ఎనటి రామారావు 29వ వర్ధంతిని శనివారం పార్టీ లోని ఇరువర్గాలు వేర్వేరుగా నిర్వహించారు. నియోజకవర్గ నాయ కుడు జయచంద్రారెడ్డి, టీడీపీరాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పర్వీ నతాజ్‌లు జ్యోతిచౌక్‌లో ఎన్టీఆర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళులర్పించారు.స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పాలు, ఫలహారం అందించారు. అదేవిధంగా టీడీపీ మండల కన్వీనర్‌ నారాయణస్వామిరెడ్డి, టౌనకన్వీనర్‌ బంగారు వెంకట్రమణ, నియోజకవర్గ పోల్‌కోఆర్డినేటర్‌ కుడుంశ్రీనివాసులు ఆధ్వర్యంలో జ్యోతిచౌక్‌లో ఎన్టీఆర్‌కు నివాళులర్పించి అన్నసంతర్పణ చేశారు. కార్యక్రమాలలో నాయకులు డేరంగుల నారాయణ, చావిడికిట్టన్న, దేవరింటికుమార్‌, కనకంటిప్రసాద్‌, సుకుమార్‌, గంజిమోహన, మొటుకుశివ, ప్రభాకర్‌, బావిసిద్దారెడ్డి, మస్తాన పాల్గొన్నారు.

ములకలచెరువులో: ములకలచెరువులో శనివారం ఎన్టీఆర్‌ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. స్థానిక పార్టీ కార్యాలయంలో తంబళ్లపల్లె టీడీపీ ఇనచార్జి జయచంద్రారెడ్డి, రాష్ట్ర బీసీ సెల్‌ అధికార ప్రతినిధి గుత్తికొండ త్యాగరాజు, జిల్లా కార్యదర్శి ఎర్రగుడి సురేష్‌, మార్కెట్‌ కమిటీ మాజీ వైస్‌ చైర్మన కేవీ రమణ ఎన్టీఆర్‌ విగ్రహానికి పూజలు నిర్వహించి నివాళులర్పించారు. స్థానిక ప్రభు త్వాసుపత్రిలో రోగులకు పాలు, పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. అలాగే స్థానిక బస్టాండ్‌ సర్కిల్లో మండల అధ్యక్షుడు పాలగిరి సిద్దా ఆధ్వర్యంలో పార్టీ పతాకం ఎగురవేసి ఎన్టీఆర్‌ చిత్ర పటా నికి నివాళులర్పించారు. కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి వెంకటస్వామి, నేతలు చెన్నకృష్ణా, కేశవులు, ముత్తుకూరు మౌళా, సుధాకర్‌నాయుడు, విజయ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

కురబలకోటలో: టీడీపీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎనటీఆర్‌ 29వ వర్ధంతి వేడుకలను పురస్కరించుకుని చిత్రపటా నికి తంబళ్ళపల్లె నియోజకవర్గ నేత జయచంద్రారెడ్డి పూలమాల వేసి నివాళులర్పించ్నారు. అనంతరం అన్నదానం, ఆసుపత్రిలో పండ్లు, బ్రెడ్‌లు పంచిపెట్టారు. నియోజకవర్గ పరిశీలకుడు మల్లికా ర్జుననాయుడు, మండల అధ్యక్షుడు వై.జి..సురేంద్ర యాదవ్‌, మాజీ ఎంపీపీలు తిమ్మరాయుడు, వెంకటరమణారెడ్డి, తెలుగు యువత నియోజకర్గ అధ్యక్షుడు శ్రీనాథ్‌రెడ్డి, మాజీ సర్పంచ రమణ, అయూబ్‌బాషా, రెడ్డిశేఖర్‌రెడ్డి, అశోక్‌ పాల్గొన్నారు.

Updated Date - Jan 18 , 2025 | 11:55 PM