ముగిసిన నల్లనమ్మ పంచమ వార్షికోత్సవం
ABN , Publish Date - Jan 31 , 2025 | 11:58 PM
మండల పరిధిలోని కీర్తిపల్లె గ్రామంలో ఉన్న నల్లనమ్మ ఆలయంలో గత రెండు రోజులుగా జరుగుతున్న పంచమ వార్షికోత్సవం ఘనంగా ముగిసింది.

వీరపునాయునిపల్లె, జనవరి 31 (ఆంధ్రజ్యోతి): మండల పరిధిలోని కీర్తిపల్లె గ్రామంలో ఉన్న నల్లనమ్మ ఆలయంలో గత రెండు రోజులుగా జరుగుతున్న పంచమ వార్షికోత్సవం ఘనంగా ముగిసింది. ఉద యం 6 నుంచి అమ్మవారికి పురోహితులచే ప్రత్యేక పూజలు జరిపించారు. అభిషేకాలు, కుంకుమార్చన, గణపత రుద్రా, లక్ష్మీనారాయణ రుద్ర, లక్ష్మీ కుబేర వాస్తు మన్య అ మ్మవారి మూలమంత్రంలో ఆయుష్య హో మంలో పూర్ణాహుతి కార్యక్రమాలు జరిగా యి. ఉదయం 10గంటలకు గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబం నుంచి మంగళవాయిధ్యాలతో అమ్మవారినామస్మరణంతో మహిళా భక్తులు బోణాల కార్యక్రమం నిర్వహించారు. అనంతరం భక్తులకు నిర్వాహకులు రామిరెడ్డి విజయ్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో అన్నదానం చేపట్టారు. ఒంగోలు జాతి ఎద్దుల బలప్రదర్శన కేటగిరీ వృషభరాజములచే బండలాగుడు పోటీలు నిర్వహించారు.