Share News

చిన్నచిన్న తప్పులను సరిదిద్దుకోవాలి

ABN , Publish Date - Feb 15 , 2025 | 11:55 PM

మదనపల్లె టీడీపీ లో నాయకులు పొరపాటున చిన్న చిన్న తప్పులు చేశారని వాటిని సరిదిద్దుకోవాలని రాజంపేట పార్ల మెంట్‌ టీడీపీ అఽధ్యక్షుడు చమర్తి జగనమోహనరాజు పేర్కొన్నారు.

చిన్నచిన్న తప్పులను సరిదిద్దుకోవాలి
మాట్లాడుతున్న జగనమోహన రాజు

అధిష్ఠానం నిర్ణయమే శిరోధార్యం

టీడీపీ రాజంపేట పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు చమర్తి

మదనపల్లె టౌన, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి): మదనపల్లె టీడీపీ లో నాయకులు పొరపాటున చిన్న చిన్న తప్పులు చేశారని వాటిని సరిదిద్దుకోవాలని రాజంపేట పార్ల మెంట్‌ టీడీపీ అఽధ్యక్షుడు చమర్తి జగనమోహనరాజు పేర్కొన్నారు. శనివారం స్థానిక దేవతాన గర్‌లోని టీడీపీ పార్లమెంట్‌ కార్యాల యంలో ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ టీడీపీ అధిష్ఠానం నిర్ణయమే అందరికి శిరో దార్య మన్నారు. కొన్ని సామాజిక న్యాయం పాటించేందుకు అక్కడక్కడ కూటమి కొత్త అభ్య ర్థులకు టికెట్‌ కేటాయించిందని, ప్రజలు కూడా కూటమిని నమ్మి, వైసీపీ పాలన అరా చకాలను తరిమికొట్టేందుకు ఓట్లు వేసి గెలిపించారన్నారు. మదనపల్లెలో టీడీపీ ఒక్కటి గానే నిలబడి ప్రజలకు అభివృద్ది, సంక్షేమాలను అందిస్తుందన్నారు. వైసీపీ అరాచకా లను అడ్డుకట్టి, వారు దోచుకున్న ప్రజలకు న్యాయం చేయడమే అజెండాగా పనిచేస్తా మన్నారు. త్వరలో టీడీపీ కార్యకర్తలు, నాయకులతో మేమంతా ఒక్కటే అనే కార్యక్ర మంలో భాగంగా జిల్లా మంత్రి, ఇనచార్జి మంత్రి ఆధ్వర్యంలో కూటమి నాయకులతో విస్తృతస్తాయి సమావేశం నిర్వహిస్తామన్నారు. ఎమ్మెల్యే షాజహానబాషా సహకారంతో పనిచేస్తామన్నారు. తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్‌చినబాబు మాట్లాడుతూ కొన్ని కారణాలతో కొన్ని సంఘటనలు జరిగాయన్నారు. అన్నదమ్ముల మద్య కొన్ని అపార్థాలు వస్తాయని, వాటిని తొలగించేందుకు పార్టీ అధిష్ఠానం ఎమ్మెల్యే షాజహాన బాషాను, తనను పిలిచి విచారించారన్నారు. అందరికి న్యాయం చేయాలని తాను అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లానన్నారు. మంత్రి లోకేశ ఆధ్వర్యంలో కోటి సభ్యత్వాలు చేసు కున్నామన్నారు. కార్యక్రమంలో టీడీపీ బీసీ విభాగం జిల్లా అధ్యక్షుడు పి.సురేంద్రయా దవ్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి దొరస్వామి నాయుడు, అధికార ప్రతినిధి ఆర్‌జే వెంకటేశ, టౌనబ్యాంకు చైర్మన నాదెళ్ల విద్యాసాగర్‌, మండలాధ్యక్షుడు దేవరింటి శ్రీనివాసులు, మేకల రెడ్డిశేఖర్‌, రైతు విభాగం కార్యదర్శి రాటకొండ మధుబాబు పాల్గొన్నారు.

Updated Date - Feb 15 , 2025 | 11:55 PM