సమస్యల పరిష్కారానికి వార్డు, గ్రామాల్లో సభలు
ABN , Publish Date - Jan 16 , 2025 | 11:34 PM
మదనపల్లె ని యోజకవర్గంలో పదేళ్లపాటు పనిచేసిన ఎమ్మెల్యేలు అభివృ ద్ధి చేయకుండా సర్వనాశనం చేశారని, వాటిని బాగుచే సేం దుకు గ్రామాలు, వార్డుల్లో సభ లు నిర్వహిస్తామని ఎమ్మెల్యే షాజ హానబాషా పేర్కొన్నారు.

మదనపల్లె టౌన, జనవరి 16 (ఆంధ్రజ్యోతి): మదనపల్లె ని యోజకవర్గంలో పదేళ్లపాటు పనిచేసిన ఎమ్మెల్యేలు అభివృ ద్ధి చేయకుండా సర్వనాశనం చేశారని, వాటిని బాగుచే సేం దుకు గ్రామాలు, వార్డుల్లో సభ లు నిర్వహిస్తామని ఎమ్మెల్యే షాజ హానబాషా పేర్కొన్నారు. గురువారం స్థానిక ఎమ్మెల్యే నివాసం వద్ద టీడీపీ కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ అధికారంలోకి వచ్చి ఆరు నెలల కాలంలోనే సీఎం చంద్రబాబు ఇప్పటి వరకు రూ.8కోట్ల నిధులు మంజూరు చేయిం చారని, తాజాగా మరో రూ.5కోట్లు నిధులు మంజూరు చేసి అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు. వారంలో ఐదు రోజులు ప్రజల వద్దకు వెళ్లి అధికారుల పని తీరు, పాలనపై సమీక్షలు నిర్వహిస్తామన్నారు. వార్డు సభల్లో రేషనకార్డులు, పింఛ న్లు, హౌసింగ్ ఇళ్లను కేటాయిస్తామన్నారు. సీఎం చంద్రబాబును మదనపల్లె పర్యట నకు అహ్వానించామన్నారు. సమావేశంలో జనసేన నేత శ్రీరామ రామాంజనేయు లు, టౌనబ్యాంకు చైర్మన విద్యాసాగర్, టీడీపీ నాయకులు ఎస్‌ఏ మస్తాన, నీలకంఠ, ఎం.నాగయ్య, బాలుస్వామి, దేవేంద్ర, బాబాఫకృద్దీన, చిన్నమహేష్, పాల్గొన్నారు.