Share News

అసౌకర్యాల నడుమ కేజీబీవీ

ABN , Publish Date - Feb 08 , 2025 | 11:56 PM

బి.కొత్తకోట మండల పరిధిలోని కస్తూర్భా గురుకుల విద్యాలయం అసౌకర్యాల నడుమ కొట్టుమిట్టాడుతోంది.

అసౌకర్యాల నడుమ కేజీబీవీ
కస్తూర్భా స్కూల్‌లో వివరాలు వెల్లడిస్తున్న సామాజిక తనిఖీ బృందం

అర్ధాకలి చదువులు ఫబాలికలకు అరకొర వైద్యసేవలు స్కూల్‌లో లేని పిల్లలకూ ఉన్నట్లు హాజరు సామాజికతనిఖీ బృందం వెల్లడి

బి.కొత్తకోట, ఫిబ్రవరి 8(ఆంధ్రజ్యోతి): బి.కొత్తకోట మండల పరిధిలోని కస్తూర్భా గురుకుల విద్యాలయం అసౌకర్యాల నడుమ కొట్టుమిట్టాడుతోంది. కాగా విద్యాలయంలో రెండురోజుల పాటు సోషియల్‌ ఆడిట్‌ జరిగింది. దీని కి సంబంధించిన వివరాలను శనివారం బాలికల తల్లిదండ్రుల సమావే శం నిర్వహించి ఆడిట్‌బృందం సభ్యులు వెల్లడించారు. రెండురోజుల విచా రణలో విద్యార్థినులు బహిర్గతం చేసిన, తాము గమనించిన అం శాల ను ఈ సమావేశంలో వివరించారు. సమావేశంలో వారు మాట్లాడుతూ విద్యా లయంలో పిల్లలు లేకపోయినా వచ్చినట్టు హాజరు వేసినట్లు తనిఖీ బృం దం గుర్తించామన్నారు. ఏఎనఎం లేకపోవడంతో బాలికల వైద్య సేవలు కరువయ్యాయన్నారు. ఒకే వాచమెన ఉండటంతో రాత్రిళ్లు భద్రతపై అను మానాలున్నాయని బాలికలు పేర్కొన్నట్లు తెలిపారు. వేడినీళ్లు లేవని చన్నీళ్ల స్నానంచేసి అనారోగ్యం పాలవుతున్నట్లు చెప్పారు. మెనూ ప్రకారం భోజ నం తయారు చేయకుండా నీళ్లరసంతో భోజనం పెడుతున్నారని, హాస్టల్‌, తరగతి గదులలో ఫ్యాన్లు సరిగా పనిచేయడం లేదని, శానిటరీ న్యాప్‌కిన లను బర్నింగ్‌మిషన లేక వాటిని బయట డంప్‌చేశారని వారు పేర్కొన్నా రు. విద్యార్థినుల ట్యాబ్‌లను సిబ్బంది తీసుకున్నారని, విధ్యాలయం లోనికి పిల్లల రాకపోకలు, ఇతరులు వచ్చి వెళ్లే వివరాలను సరిగా రిజిస్టర్‌లో నమోదు చేయడం లేదని వివరించారు. ఆడిట్‌ బృందం 175 ప్రశ్నలతో కూడిన విచారణను చేసిందన్నారు. విద్యార్థినులకు సిబ్బందితో ఎటువంటి సమస్యలు ఎదురైనా 14417 టోల్‌ఫ్రీ నంబరుకు కాల్‌ చేయాలని వారు తల్లిదండ్రులను కోరారు. కాగా విద్యాలయంలో 250మంది పైగా విద్యార్థిను లుండగా 30మంది విద్యార్థినుల తల్లిదండ్రులు మాత్రమే హాజరు కావడం కొసమెరుపు. ఈ విషయమై ఎస్వో విశ్వలత సమావేశంలో వివరణ ఇస్తూ ఏఎనఎం, వాచమెన, ఫ్యాన్లు, హాట్‌వాటర్‌ తదితర సౌకర్యాలు ప్రభుత్వం కల్పించాల్సిఉందన్నారు. మిగతా అంశాలను చక్కదిద్దుతామన్నారు. కార్య క్రమంలో కేజీబీవీ స్పెషలాఫీసర్‌ విశ్వలత, స్కూల్‌ మేనేజ్మెంట్‌ కమిటీ చైర్మన, వై్‌స్‌చైర్మనలు రూప, వెంకటసుబ్బయ్య, కేజీబీవీ సిబ్బంది, సోషి యల్‌ ఆడిట్‌ బృంద సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - Feb 08 , 2025 | 11:56 PM