కమనీయం...శ్రీనివాసుడి కల్యాణం
ABN , Publish Date - Feb 09 , 2025 | 11:39 PM
తంబళ్లప ల్లె మండలం కోసువారిపల్లెలో కొలువైన ప్రసన్న వేంకటరమణ స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్స వాలల్లో భాగంగా ఆదివారం శ్రీనివాసుడి కల్యా ణం కమనీయంగా జరిగింది.

తంబళ్లపల్లె, ఫిబ్రవరి 9(ఆంధ్రజ్యోతి): తంబళ్లప ల్లె మండలం కోసువారిపల్లెలో కొలువైన ప్రసన్న వేంకటరమణ స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్స వాలల్లో భాగంగా ఆదివారం శ్రీనివాసుడి కల్యా ణం కమనీయంగా జరిగింది. గత ఐదు రోజులు గా టీటీడీ ఆధ్వర్యంలో వెంకన్న వార్షిక బ్రహ్మో త్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం నిత్య కైంకర్యాలు పూర్తి చేసుకున్న అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత వేంకటరమణ స్వామి వారు సర్వభూ పాల వాహనంపై ఆలయ మాడ వీధుల్లో విహ రిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. సాయంత్రం టీటీడీ వేదపండితులు వేదమంత్రోచ్ఛారణలు మంగళవాయిద్యాలు, అన్నమయ్య సంకీర్తనల నడుమ తిరుమలేశుడి పరిణయం నయన మనో హరంగా జరిపించారు. అశేష సంఖ్యలో తరలివ చ్చిన భక్తులు శ్రీనివాసుడి కల్యాణాన్ని తిలకించి తరించారు. భక్తజనం చేసిన గోవింద నామస్మర ణలతో వేదిక ఆవరణం మార్మోగింది. స్వామి వారి కళ్యాణోత్సవంలో టీడీపీ ఇనచార్జి దాసరి పల్లె జయచంద్రారెడ్డి, కల్పనారెడ్డి దంపతులు, ప్రచార సమన్వయకర్త సీడ్ మల్లికార్జుననా యుడు, అరుణ దంపతులు, మండలాధ్యక్షుడు రెడ్డప్పరెడ్డి,సిద్దమ్మ, క్లస్టర్ ఇంచార్జి బేరి శ్రీనివా సులు, సోముశేఖర్, ఆదిరెడ్డి, ఆనందనాయుడు, శివరాం, జయరాంరెడ్డి, రవిచంద్ర, కేశవరెడ్డి, భక్తులు పాల్గొన్నారు.
గరుడ వాహనంపై దేవదేవుడు
కల్యాణం అనంతరం దేవదేవుడు తన ఇష్ట వా హనమైన గరుత్మంతునిపై ఆలయ మాడవీధు ల్లో విహరించారు. వందలాది మంది భక్తులు గరుడ వాహనంపై స్వామి వారిని దర్శించుకుని ఆధ్యాత్మిక తన్మయత్వం చెందారు. ఆలయ సిబ్బంది భక్తులకు టీటీడీ లడ్డూలను పంపిణీ చేశారు. బ్రహ్మోత్సవాల్లో సోమవారం ఉదయం రథోత్సవం, గజవాహనసేవ నిర్వహించనున్నా రు. కార్యక్రమాల్లో టీటీడీ డిప్యూటీ ఈవో వరల క్ష్మీ, ఆలయ ఇనస్పెక్టర్ కృష్ణమూర్తి, సిబ్బంది నగేష్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.