Share News

కేసుల్లో రాజీ కావడం వల్ల ఇద్దరు గెలిచినట్లే..

ABN , Publish Date - Mar 08 , 2025 | 11:48 PM

కక్షిదారులు రాజీ మార్గంలో కేసులు పరిష్కారం చేసుకోవడం వలన ఇద్దరు గెలిచినట్లేనని జమ్మలమడుగు జూనియర్‌ సివిల్‌జడ్జి ఎస్‌.భార్గవి పేర్కొన్నారు.

కేసుల్లో రాజీ కావడం వల్ల ఇద్దరు గెలిచినట్లే..
జమ్మలమడుగులో మాట్లాడుతున్న జడ్జి భార్గవి

జమ్మలమడుగు, మార్చి 8 (ఆంధ్రజ్యోతి): కక్షిదారులు రాజీ మార్గంలో కేసులు పరిష్కారం చేసుకోవడం వలన ఇద్దరు గెలిచినట్లేనని జమ్మలమడుగు జూనియర్‌ సివిల్‌జడ్జి ఎస్‌.భార్గవి పేర్కొన్నారు. శనివారం జమ్మలమడుగు కోర్టు ఆవరణలో జాతీయ లోక్‌ అదాలత్‌ అనంతరం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకున్నారు. ముందుగా ఏర్పాటు చేసిన సమావేశంలో కక్షిదారులను ఉద్దేశించి జడ్జి మాట్లాడారు.బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి మాట్లాడుతూ కక్షిదారులు లోక్‌ అదాలత్‌లో కేసులను పరిష్కరించుకోవడం వలన వారికి సుప్రీం కోర్టు తీర్పుతో సమానంగా ఉంటుందన్నారు. అనంతరం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురష్కరించుకుని జడ్జి భార్గవిని, న్యాయవాదులు, మహిళా ఉద్యోగులను ఘనంగా సన్మానించారు.

భారీస్థాయిలో కేసులు పరిష్కారం

జమ్మలమడుగు జూనియర్‌ సివిల్‌జడ్జి కోర్టులో జరిగిన జాతీయ లోక్‌ అదాలత్‌ కార్యక్రమంలో భారీస్థాయి కేసులు పరిష్కారం జరిగాయి. వివిధ కేసులకుసంబంధించి మొత్తం 1005 కేసులు పరిష్కారం అయినట్లు లోక్‌ అదాలత్‌ సభ్యురాలు సంధ్య తెలిపారు. ఇందుకు సంబందించి కేసుల పరిష్కారంలో రూ.90,72,967 పరిష్కారం అయిందన్నారు.

Updated Date - Mar 08 , 2025 | 11:48 PM