Share News

వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చండి

ABN , Publish Date - Jan 09 , 2025 | 11:49 PM

వాల్మీకి బోయ లను ఎస్టీ జాబితాలో పునరు ద్ధరణ చేయాలని ఆర్‌వీఎస్‌ ఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు బంగారు కృష్ణమూర్తి, జిల్లా కార్యదర్శి బుర్రా రమణ డిమాండ్‌ చేశా రు.

వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చండి
తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట నిరసన తెలుపుతున్న వాల్మీకులు

ములకలచెరువు, జనవరి 9 (ఆంధ్రజ్యోతి): వాల్మీకి బోయ లను ఎస్టీ జాబితాలో పునరు ద్ధరణ చేయాలని ఆర్‌వీఎస్‌ ఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు బంగారు కృష్ణమూర్తి, జిల్లా కార్యదర్శి బుర్రా రమణ డిమాండ్‌ చేశా రు. స్ధానిక తహసీల్దార్‌ కార్యాల యం ఎదుట వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రాంతీయ వ్యత్యాసాలను తొలగించి వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో పునరు ద్ధరణ చేయాల న్నారు. వాల్మీకులు రాయలసీమ, కోస్తా ప్రాంతాల్లో బీసీ జాబితాలో ఉండడం దురదృష్టకరమన్నారు. అనంతరం తహసీల్దార్‌ ప్రదీప్‌కు వినతి పత్రం అందజేవారు. ఈ కార్యక్ర మంలో రాష్ట్ర జయింట్‌ సెక్రటరీ ఆనంద్‌, రాష్ట్ర అధికార ప్రతినిధి మేకల శివప్రసాద్‌, రాయలసీమ జిల్లాల మహిళా విభాగం అధ్యక్షురాలు ప్రమీల, శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షుడు మల్లెం అశోక్‌, నాయకులు పాల్గొన్నారు.

పెద్దతిప్పసముద్రంలో : ఏపీలో వాల్మీకి బోయలను ఎస్టీ జాబితా లో చేర్చాలని కోరుతూ గురువారం స్థానిక మండల తహసీల్దార్‌కు జిల్లా వాల్మీకి సేవా సంఘం అధ్య క్షుడు మండ్ల జయశంకర్‌ ఆధ్వ ర్యంలో వినతి పత్రాన్ని అందచేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షు డు కూటమి ప్రభుత్వమైనా వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలోకి చేర్చాలని కోరారు. వాల్మీకి నాయకులు యనమల రామచంద్ర, వెంకటేష్‌, మండ్ల రామకృష్ణ, గంగాధర్‌, సోమశే ఖర్‌, రాజు, రెడ్డెప్ప పాల్గొన్నారు.

Updated Date - Jan 09 , 2025 | 11:49 PM