వానొస్తే... భయం.... భయం
ABN , Publish Date - Aug 13 , 2025 | 11:15 PM
వర్షం కురిస్తే చాలు అటు హోమియోపతి వైద్యశాల, ఇటు ఆరోగ్య ఉపకేంద్రంలో సిబ్బంది గుండెలదిరి పోతుంటాయి. ఎప్పుడో 40 ఏళ్ల కిందట నిర్మించి న భవనాలు కావడంతో పెచ్చులూడి, భవనాలు మొత్తం ఉరుస్తున్నాయి. దీంతో ఆరుబయటే చెట్ల కింద రోగులకు వైద్య సేవలు అం దించాల్సిన దుస్థితి నెలకొం ది.
కూలేందుకు సిద్ధంగా హోమియోపతి వైద్యశాల - ఆరోగ్య ఉపకేంద్రం
40 ఏళ్ల కిందట నిరించిన భవనాలు
ఆరుబయటే వైద్య సేవలు
ములకలచెరువు, ఆగస్టు 13(ఆంధ్రజ్యోతి): వర్షం కురిస్తే చాలు అటు హోమియోపతి వైద్యశాల, ఇటు ఆరోగ్య ఉపకేంద్రంలో సిబ్బంది గుండెలదిరి పోతుంటాయి. ఎప్పుడో 40 ఏళ్ల కిందట నిర్మించి న భవనాలు కావడంతో పెచ్చులూడి, భవనాలు మొత్తం ఉరుస్తున్నాయి. దీంతో ఆరుబయటే చెట్ల కింద రోగులకు వైద్య సేవలు అం దించాల్సిన దుస్థితి నెలకొం ది. స్థానిక జడ్పీ హైస్కూల్ వద్ద 40 ఏళ్ల కిందట నిర్మిం చిన భవనాల్లో ప్రభుత్వాస్పత్రి నడిచేది. అయితే 15 ఏళ్ల కింద ట కదిరి రోడ్డు సమీపంలోకి ప్రభుత్వాస్పత్రిని మార్చడంతో ఇక్కడ ప్రభుత్వ హోమియోపతి వైద్యశాల, ఆరోగ్య ఉపకేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం 40 ఏళ్ల కిందట ని ర్మించిన భవనాల పైకప్పు మొత్తం పెచ్చులూడి పో యాయి. భవ నాలు దెబ్బతిని కూలిపోయే స్థితికి చేరాయి. దీంతో చిన్నపాటి వర్షాలకే భవనాలు ఉరుస్తున్నాయి. ఈ భవనాలు కూలిపోయే ప్రమాదం ఉండడంతో ఆరోగ్య ఉపకేంద్రాన్ని ఆరుబయటే నిర్వహిస్తు న్నారు. ప్రతి బుధవారం పిల్లలకు టీకాలు కూడా బయటే వేసి పంపుతున్నారు. వైసీపీ ప్రభుత్వం లో ఈ భవనాల గురించి పట్టించుకోకపోవడంతో మరింత దుస్థితికి చేరి కూలే స్థితికి చేరాయి.
హైస్కూల్ బాలికల బాత్‌రూం వద్ద కూలిన ప్రహరీ
ములకల చెరువులో నాలుగు రోజులుగా కురుస్తు న్న వర్షానికి భవనాలు భారీగా ఉరుస్తున్నాయి. ఉన్నతాధికారులు తక్షణం చొరవ తీసుకుని పాత భవనాలు కూలిపోక ముందే కొత్త భవనాలు నిర్మించాలని అధికారులను స్థానికు లు కోరుతున్నారు.
కుంటను తలపిస్తున్న తారురోడ్డు
పెద్దమండ్యం, ఆగస్టు 13(ఆంధ్రజ్యోతి): పెద్దమండ్యంలో తారురోడ్డు నీటికుంటలను తలపిస్తున్నాయి. రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి మెయిన్ రోడ్డు, విద్యానగర్ కాలనీ, జండమాను ప్రాంతం జలమయమై కుంటలను తలపిస్తున్నాయి. గతంలో తారురోడ్డు మరమ్మతులు కూడా నాసిరకంగా జరగడంతో ఈ వర్షాలకు తారుకొట్టు కు పోయి గుంతల మయమయ్యాయి. రెండు రోజులుగా కురుస్తున్న వర్షంతో తారు రోడ్డు గుంతల్లో వర్షపు నీరు నిల్వలతో ప్రజలు పలు ఇక్కట్లు పడుతున్నారు. ఈ వర్షాలు ఆగిన వెంటనే తారురోడ్డు మరమ్మతు కానీ సీసీ రోడ్డు వేయాలని ఆర్‌అం డ్‌బీ అధికారులకు ప్రజలు కోరారు. తుపాన్ వర్షం ధాటికి పెద్దమండ్యం హైస్కూల్ లో కూలీన ప్రహరీ వెంటనే నిర్మించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరారు. హైస్కూల్ మైయిన్ రోడ్డు పక్క నున్న ప్రహరీ నెమ్మెక్కి కుప్ప కూలింది. బాలికలు బాత్‌రూంలకు వెళ్లాలంటే రెండు రోజులుగా విద్యార్థినులు ఇబ్బందులు పడుతున్న ట్లు సమాచారం. అధికారులు చర్యలు తీసుకుని తాత్కాలిక పనులు, బాత్ రూంలకు టార్ఫాలిన్ పట్టలు కట్టాలని ప్రజలు కోరుతున్నారు.

చినుకు పడితే....చిత్తడే
రొచ్చుగా మారిన ములకలచెరువు
అడుగేయలేని దుస్థితి
ములకలచెరువు, ఆగస్టు 13(ఆంధ్రజ్యోతి): చినుకు పడితే చాలు చిత్తడిగా మారు తోంది. నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షానికి ములకల చెరువు రొచ్చు... రొచ్చుగా మారిపోయింది. బురదమయమైన రోడ్లు, వీధుల్లో అడుగు ముందుకేయలేని పరిస్థి తి నెలకొంది. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షానికి ప్రభుత్వాస్పత్రికి వెళ్లే రోడ్డు మొదట్లో వర్షపు నీరు పెద్ద ఎత్తున చేరడంతో రాకపోకల్లో తీవ్ర ఇబ్బందులు కలుగు తున్నాయి. ప్రభుత్వాస్పత్రి సహా జూనియర్ కళాశాల, మోడల్ స్కూళ్లకు వెళ్లాలంటే ఈ రోడ్డు గుండానే వెళ్లాలి. బుధవారం కూడా ఏకధాటిగా వర్షం కురుస్తూనే ఉండ డంతో రోడ్డుపై చేరిన వర్షపు నీటితో రోగులు, విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. ఎంపీడీఓ కార్యాలయం వెనుక భాగం ఉన్న రోడ్డు, కదిరి రోడ్డు సమీప రోడ్డు, రాజీ వ్ కాలనీ, త్యాగరాజు కాలనీ, నట్లగుట్ట తదితర రోడ్డు రొచ్చుగా మారాయి. మార్కె ట్ యార్డు, ఆర్టీసీ బస్టాండు ప్రాంగణం బురదమయం కావడంతో రైతులు, ప్రయా ణికులు అవస్థలు పడుతున్నారు. వృద్ధులు, పిల్లలు నడవలేక జారి పడుతున్నారు. స్థానిక రైల్వేగేటు వద్ద ముంబై - చెన్నై జాతీయ రహదారికి అనుకుని పెద్ద ఎత్తున వర్షపు నీరు నిల్వ ఉండడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలుగుతోంది. దుగుసానివారిపల్లె, గుండాలవారిపల్లె, పాత ములకలచెరువు, పోకనాటివారిపల్లె, వడ్డిపల్లె తదితర గ్రామాల రోడ్లు బురదమయమన్నాయి.
రోడ్డెక్కిన మురుగు
కాల్వపై అక్రమ నిర్మాణం
పట్టించుకోని అధికారులు
సమస్యల వలయంలో ఇందిరానగర్
పీలేరు రూరల్, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): కాల్వలో పారాల్సి న మురుగునీరు రోడ్డెక్కుతోంది. కాల్వలపై అక్ర మంగా నిర్మాణాలు చేపడుతున్నా అధికారులు పట్టించుకోక పోవడంతో మురుగు దుర్గంధం వెదఝల్లుతోంది. పంచాయతీ అధికారుల పర్య వేక్షణ లోపమే ఇందుకు కారణమని కాలనీ వా సులు వాపోతున్నారు. చెత్తాచెదారం ఎక్కడి కక్క డ పేరుకు పోతుండడంతో మురుగునీరు పారకుం ది. ఇటీవల కురుస్తున్న వర్షంతో కాల్వలో పారాల్సి న మురుగు రోడ్డెక్కుతుండడంతో జనం బయటకు రావాలన్నా ఇబ్బందులు తప్పడం లేదు. నిత్యం రద్దీగా ఉండే ఇందిరానగర్‌లో మురుగు నీటి కాల్వ లు, వీధులు ఆక్రమణకు గురైనా పంచాయతీ, ఆర్ డబ్లూఎస్ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ప్రజ లకు ఇబ్బందులు తప్పడంలేదు. మురుగు నీటి కాల్వల పై అక్రమ కట్టడాలు చోటు చేసుకోవడంతో మురుగునీరు రోడ్డుపై ప్రవహిస్తోంది. ఇందిరానగర్, సుధాసుధీర్, శ్రీనివాస నగర్ తదితర ప్రాంతాల్లో దశాబ్దాల కిందట నిర్మించిన మురుగు నీటి కాల్వలు ఛిద్రమయ్యాయి. లక్షలాది రూపా యలు వెచ్చించి నిర్మించిన సీసీ రోడ్లలో నాణ్యత లేకపోవ డంతో పలు చోట్ల సిమెంట్ లేచిపోయి గుంతలు పడ్డాయి. పట్టణంలో ఎంతో ప్రాధాన్యత ఉన్న ఇందిరా నగర్‌లో తిష్టవే సిన సమస్యల పరిష్కారంపై ఇప్పటికైనా అధికారులు స్పందించాల్సిన అవసరం ఉంది.
చర్యలు తీసుకుంటాం
.ఇందిరానగర్‌లో మురుగు కాల్వల ఆక్రమణ దారులపై చర్యలు తీసుకుం టాం. మురుగు నీరు వీధుల్లోకి రాకుండా పంచాయతీ పారిశుధ్య కార్మికులకు పంపి చర ్యలు తీసుకున్నాం. ఇప్పటికే కొన్ని సమస్యలు తమ దృష్టికి వచ్చాయని వాటిని సత్వరం పరిష్కారిస్తాం. దెబ్బతిన్న మురుగు నీటి కాల్వలు మర్మతులు చేయాల్సి ఉంది.
లతీఫ్‌ఖాన్, ఇన్‌చార్జి ఈఓ, పీలేరు