Share News

ఎన్నికల హామీలను నిలబెట్టుకోకుంటే ఉద్యమం

ABN , Publish Date - Jan 16 , 2025 | 11:45 PM

ప్రస్తుత కూటమి ప్రభుత్వం 20 24 సాధారణ ఎన్నికల ప్రచారంలో ఉద్యో గ, ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుంటే ఉద్యమిస్తామని ఎస్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు రఘునాథరెడ్డి పేర్కొన్నారు.

ఎన్నికల హామీలను నిలబెట్టుకోకుంటే ఉద్యమం
మాట్లాడుతున్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు రఘునాథరెడ్డి

ఎస్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యర్శి మల్లు రఘునాథరెడ్డి

కడప ఎడ్యుకేషన, జనవరి 16 (ఆంధ్రజ్యోతి): ప్రస్తుత కూటమి ప్రభుత్వం 20 24 సాధారణ ఎన్నికల ప్రచారంలో ఉద్యో గ, ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుంటే ఉద్యమిస్తామని ఎస్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు రఘునాథరెడ్డి పేర్కొన్నారు. గురువారం కడపలోని ఎస్టీయూ భవనలో జరిగిన ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఐదేళ్లుగా రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయులు వారి జీతాలు మినహా మరే ఇతర ఆర్థికపరమైన లబ్ధిపొందలేదని, సరెండర్‌ లీవులు, డీఏ అరియర్స్‌, పీఆర్‌సీ బకాయిలు, రెండు సంవత్సరాల నుంచి ఏపీజీఎల్‌ఐ పాలసీలు మెచ్యుర్‌ అయినప్పటికి చెల్లింపులు మరిచారన్నా రు. మొత్తం బకాయిలు రూ.32వేల కోట్లు ఉండగా ఈ సంక్రాంతికి కేవలం 10శాతం మాత్రమే చెల్లించారన్నారు. మిగిలిన 90శాతం సంగతి ఏమిటని ప్రశ్నించారు. 12వ వేతన సవరణ సంఘానికి సం బంధించిన కమిషన ఏర్పాటు ప్రక్రియ మొ దలుపెట్టలేదని, ఇప్పటికే 19 నెలలు ఆలస్యమైందన్నారు. ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలు అవుతోందని, ఇప్పటికీ ఎన్నికల హామీలు అయిన బకాయిల చెల్లింపు, 12వ పీఆర్సీ అంశాలపై ఉద్యోగ సంఘాలను చర్చలకే ఆ హ్వానించడం లేదన్నారు. గత ప్రభుత్వం వ ల్లే ప్రస్తుత ప్రభుత్వం కూడా బడ్జెట్‌ పేరు చెప్పి ఉద్యోగ ఉపాధ్యాయులకు అన్యాయం చేయవద్దని సూచించారు. ఎస్టీయూ నాయకులు ఇలియాస్‌ బాషా, సంగమేశ్వర్‌రెడ్డి, రామ్మోహన, కె.సురే్‌షబాబు, బాలగంగిరెడ్డి, రవిశంకర్‌రెడ్డి, చెన్నకేశవరెడ్డి, రెడ్డన్న, బాబు పద్మాకర్‌, మహబూబ్‌ బాష, వెంకటసుబ్బయ్య, దామోదర సాదిక్‌ అలి, జయంరాం, కరిముల్లా, కృష్ణానాయక్‌ తదితరులలు పాల్గొన్నారు.

Updated Date - Jan 16 , 2025 | 11:45 PM