మహనీయురాలు డొక్కా సీతమ్మ : ఎమ్మెల్యే
ABN , Publish Date - Jan 04 , 2025 | 11:25 PM
ఆకలితో ఉన్నవారికి లేదనకుండా అన్నం పెట్టిన మహనీయురాలు డొక్కా సీతమ్మ అని ఎమ్మెల్యే పుత్తా కృష్ణచైతన్యరెడ్డి తెలిపారు.

పెండ్లిమర్రి, జనవరి 4 (ఆంధ్రజ్యోతి): ఆకలితో ఉన్నవారికి లేదనకుండా అన్నం పెట్టిన మహనీయురాలు డొక్కా సీతమ్మ అని ఎమ్మెల్యే పుత్తా కృష్ణచైతన్యరెడ్డి తెలిపారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు విద్యార్థినులు, అధ్యాపకులు ఘన స్వాగతం పలికారు. ముందస్తు సంక్రాంతి వేడుకలను పురస్కరించుకొని విద్యార్థినులు కళాశాల ప్రాంగణంలో వేసిన రంగురంగుల ముగ్గులు అందరిని ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా విద్యార్థినులతో కలిసి కళాశాల ప్రాంగణంలో ఎమ్మెల్యే మొక్కలు నాటారు.
విద్యావ్యవస్థలో
సమూల మార్పులకు శ్రీకారం:ఎమ్మెల్సీ
వేంపల్లె, జనవరి 4 (ఆంధ్రజ్యోతి): బడుగు, బలహీన వర్గాల పేదలు ఉన్నత విద్య చదివేలా కూటమి ప్రభుత్వం విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకువస్తోందని ఎమ్మెల్సీ రామగోపాల్‌రెడ్డి అన్నారు. వేంపల్లెలోని ఉర్దూ జూనియర్ కళాశాలలో శనివారం డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ఎమ్మెల్సీ ప్రారంభించారు. కళాశాలల ఆర్జేడీ రవినాయక్, స్పెషలాఫీసర్ అర్జునరావ్, ఎంపీడీఓ కుళాయమ్మ కలిసి విద్యార్థులతో డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు.
మధ్యాహ్న భోజనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్సీ
పులివెందుల రూరల్, జనవరి 4 (ఆంధ్రజ్యోతి): పట్టణంలోని వైఎ్‌సవీఆర్‌ఎం ప్రభభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో శనివారం డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ఎమ్మెల్సీ రామగోపాల్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూనియర్ కళాశాలల్లోని విద్యార్థులకు పౌష్టికాహారం ఇవ్వాలన్న ఏకైక లక్ష్యంతో పాఠశాలకే పరిమితమైన డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా 475 కళాశాలల్లో అమలు చేస్తున్నారన్నారు. అనంతరం ఐసీడీఎస్ పీడీ, పులివెందుల మండల ప్రత్యేకాధికారి శ్రీలక్ష్మి మాట్లాడుతూ రక్తహీనతను తగ్గించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పౌష్టికాహారం అందిస్తోందన్నారు.
చక్రాయపేటలో...
చక్రాయపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శనివారం అధికారులు మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించారు. అనంతరం కళాశాల ప్రిన్సిపాల్ ఎస్.రంతుబాషా, తహసీల్దార్ విజయకుమారి, ఎంపీడీఓ రాజశేఖర్‌రెడ్డి, మండల ప్రత్యేకాధికారి ఆజాద్‌వలి, ఎంఈఓ రవికుమార్ తదితరుల చేతులమీదుగా విద్యార్థులకు భోజనం వడ్డించారు.
ప్రతి విద్యార్థికి పౌష్ఠికాహారం లక్ష్యం
ఎమ్మెల్యే మాధవి
కడప ఎడ్యుకేషన, జనవరి 4 (ఆంధ్రజ్యోతి): ప్రతి విద్యార్థికి పౌష్ఠికాహారం ఇవ్వాలన్నదే కూటమి ప్రభు త్వం లక్ష్యమని కడప ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ మాధవి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఆర్.శ్రీనివాసరెడ్డి తెలిపారు. ప్రభుత్వం నిర్ణయించిన మెనూ తప్పనిసరిగా పాటించాలన్నారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని పిలుపునిచ్చారు. శనివారం కడప నగరం ప్రభుత్వ బాలుర కళాశాలలో మధ్యాహ్న భోజనం పథకాన్ని వారు ప్రారంభించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.