Share News

యువత ఉపాధికి ప్రభుత్వం పెద్దపీట

ABN , Publish Date - Jan 24 , 2025 | 11:50 PM

నిరుద్యోగ యువతీ, యువకుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని తంబళ్లపల్లె నియోజకవర్గ టీడీపీ ఇనచార్జి దాసరిపల్లి జయచంద్రారెడ్డి పేర్కొన్నారు.

యువత ఉపాధికి ప్రభుత్వం పెద్దపీట
సమావేశంలో మాట్లాడుతున్న తంబళ్లపల్లె టీడీపీ ఇనచార్జి జయచంద్రారెడ్డి

చంద్రన్న స్వయం ఉపాధి రుణాలను నిరుద్యోగులు

సద్వినియోగం చేసుకోవాలి

50 శాతం నియోజకవర్గానికి 300 యూనిట్లు మంజూరు

తంబళ్లపల్లె టీడీపీ ఇనచార్జి జయచంద్రారెడ్డి

ములకలచెరువు, జనవరి 24(ఆంధ్రజ్యోతి): నిరుద్యోగ యువతీ, యువకుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని తంబళ్లపల్లె నియోజకవర్గ టీడీపీ ఇనచార్జి దాసరిపల్లి జయచంద్రారెడ్డి పేర్కొన్నారు. ములకలచెరువులోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రన్న స్వయం ఉపాధి పథకం కింద ప్రభుత్వం 50 శాతం సబ్సిడీతో అందిస్తున్న స్వయం ఉపాధి రుణాల ను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తంబళ్లపల్లె నియోజకవర్గంలోని ములకలచెరువు, తంబళ్లపల్లె, పెద్దతిప్పసముద్రం, బి.కొత్తకోట, పెద్దమండ్యం, కురబలకోట మండలాలకు సుమారు 300 స్వయం ఉపాధి రుణాల యూనిట్లను ప్రభత్వం మంజూరు చేసిందన్నారు. ఇందులో బీసీ, కాపు, ఈడబ్ల్యూఎస్‌, రెడ్డి, క్షత్రియ కార్పొరేషన్ల ద్వారా 50 శాతం సబ్సిడీతో బ్యాంకు రుణాలు అందిస్తుందన్నారు. రూ.2లక్షల నుంచి రూ.5లక్షల వరకు అందించే రుణాలకు సగం సబ్సిడీ ఉంటుందన్నారు. అర్హులైన నిరుద్యోగ యువతీ, యువకులు స్వయం ఉపాధి రుణాలకు దర ఖాస్తు చేసుకోవాలన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం నిరుద్యోగుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం ముందడుగు వేసింద న్నారు. రాష్ట్రంలో నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు ముఖ్యమం త్రి చంద్రబాబునాయుడు పెట్టుబడులు పెట్టాలని దావోష్‌కు వెళ్లి పారిశ్రా మికవేత్తలను ఆహ్వానించారన్నారు. గత ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వంలో జగన నిరుద్యోగులను ఎన్నడూ పట్టించుకోలేదన్నారు. కూటమి ప్రభుత్వం అధికా రంలోకి వచ్చిన ఐదు నెలల వ్యవధిలోనే పెద్ద ఎత్తున యువతీ, యువకు లకు 50 శాతం సబ్సిడీతో స్వయం ఉపాధి రుణాలు అందించేందుకు సిద్ధమైందన్నారు. ఈ సమావేశంలో నాయనిచెరువుపల్లె సర్పంచ సంధ్యా జనార్ధనరెడ్డి, నాయకులు చంద్రమోహనరెడ్డి, సుబ్బినాయుడు, ఎర్రంరెడ్డి, భజంత్రి రామాంజులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 24 , 2025 | 11:51 PM