Share News

ఫోర్జరీ సంతకాలతో డిజిటల్‌ అసిస్టెంట్‌ మ్యుటేషన

ABN , Publish Date - Feb 03 , 2025 | 11:38 PM

రామసముద్రం మండలం చొక్కాండ్లపల్లె గ్రామ సచివాలయంలో డిజిటల్‌ అసిస్టెంట్‌ గా విధులు నిర్వహిస్తున్న దిలీప్‌కుమార్‌ ఫోర్జరీ సంతకాలతో తన పేరున మ్యుటేష న చేశారని పలమనేరు తాలుకా గంగవ రం రెంటకుంట్ల గ్రామానికి చెందిన శాంత మ్మ అధికారులకు ఫిర్యాదు చేశారు.

 ఫోర్జరీ సంతకాలతో డిజిటల్‌ అసిస్టెంట్‌ మ్యుటేషన
సచివాయ డిజిటల్‌ అసిస్టెంట్‌పై ఎంపీడీవోకు ఫిర్యాదు చేస్తున్న శాంతమ్మ

రామసముద్రం, ఫిబ్రవరి 3(ఆంధ్ర జ్యోతి): రామసముద్రం మండలం చొక్కాండ్లపల్లె గ్రామ సచివాలయంలో డిజిటల్‌ అసిస్టెంట్‌ గా విధులు నిర్వహిస్తున్న దిలీప్‌కుమార్‌ ఫోర్జరీ సంతకాలతో తన పేరున మ్యుటేష న చేశారని పలమనేరు తాలుకా గంగవ రం రెంటకుంట్ల గ్రామానికి చెందిన శాంత మ్మ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఆమేర కు ఆమె సోమవారం రామసముద్రం ఎంపీ డీవో భానుప్రసాద్‌కు, పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలు శాంతమ్మ వివరాల మేరకు గంగవరం మండల రెవెన్యూ పరిధిలో సర్వే నెంబర్‌ 346/2ఏ-1ఏలో 0.81సెంట్ల భూమి ఉండగా గంగవరంకు చెందిన ఎస్‌ఆర్‌ అలేఖ్యకు పలమనేరు రిజిస్టర్‌ కార్యాల యంలో దస్తవేజు నెంబర్‌ 294/2024తో రిజిసే్త్రషన చేసి ఇచ్చింది. దీంతో గంగవరం రెవెన్యూ రికార్డ్‌లో కొనుగోలుదారులకు అడంగల్‌, 1బీ నమోదు అయ్యాయి. ఈ విషయ మై కొనుగోలుదారులకు, విక్రయదారునికి ఎటువంటి అభ్యంతరాలు లేవు. ఈనేపథ్యంలో రామసముద్రం మండలంలోని చొక్కాండ్లపల్లె సచివాలయం డిజిటల్‌ అసిస్టెంట్‌ దిలీప్‌ కుమార్‌ ఎవరో గుర్తు తెలియని వ్యక్తులతో లాలూచీ పడి శాంతమ్మ సంతకాలు ఫోర్జరీ చేసి తప్పుడు పత్రాలతో జనవరి 31, 2025న ఐడీ నెంబర్‌ 11090063తో ఆనలైనలో శాంతమ్మ పేరుపై మ్యుటేషన చేశారని ఎంపీడీవో భానుప్రసాద్‌కు, పోలీసులకు ఫిర్యా దు చేశారు. దీనిపై డిజిటల్‌ అసిస్టెంట్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు.

Updated Date - Feb 03 , 2025 | 11:38 PM