రేపు డీఈఓ కార్యాలయం ఎదుట ధర్నా
ABN , Publish Date - Jan 03 , 2025 | 12:01 AM
ఉపాధ్యాయులను తీవ్రంగా దుర్భాషలాడుతూ మానసిక క్షోభకు గురిచేస్తున్న జిల్లా విద్యాశాఖాధికారి మాకొద్దని ఈనెల 4వ తేదీన డీఈఓ ఆఫీస్ ఎదురుగా ధర్నా చేస్తున్నట్లు వైఎస్సార్ జిల్లా ఉపాధ్యాయ సంఘా ల ఐక్యవేదిక నాయకులు తెలిపారు.
కడప ఎడ్యుకేషన, జనవరి 2 (ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయులను తీవ్రంగా దుర్భాషలాడుతూ మానసిక క్షోభకు గురిచేస్తున్న జిల్లా విద్యాశాఖాధికారి మాకొద్దని ఈనెల 4వ తేదీన డీఈఓ ఆఫీస్ ఎదురుగా ధర్నా చేస్తున్నట్లు వైఎస్సార్ జిల్లా ఉపాధ్యాయ సంఘా ల ఐక్యవేదిక నాయకులు తెలిపారు. గురువారం కడప నగరం జిల్లా ఉపాధ్యాయ భవనలో ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక నా యకుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సంఘాల ఐక్యవేదిక నాయకులందరు సంయుక్తంగా మాట్లాడుతూ కడప జిల్లా విద్యాశాఖ అధికారిగా బాధ్యతలు తీసుకున్న యు.మీనాక్షి పాఠశాలలు సందర్శించినపుడు అక్కడిమండల విద్యాశాఖ అధికారులను, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులను దు ర్భాషలాడుతూ, మానసిక క్షోభకు గురిచేస్తూ బానిసలకంటే హీనంగా చూస్తున్నారని పే ర్కొన్నారు. ఉపాధ్యాయ ఐక్యవేదిక నా యకులు ఇటువంటి డీఈఓ కడప జిల్లాకు ఇక ఉండకూడదని, డీఈఓ మాకు వద్దని ఉ పాధ్యాయ ఐక్యవేదిక నాయకులు ఈనెల 4న డీఈఓ కార్యాలయం ఎదుట ధర్నాకు పిలుపునిచ్చారు. కావున ధర్నాకు హాజరుకావాలని కోరారు. ఈ సమావేశంలో ఉపాద్యాయ సం ఘాలు ఎస్టీయు, యూటీఎఫ్, పీఆర్‌టీయు, ఏపీటీఎఫ్ 257, ఏపీటీఎఫ్ 1938, పీఎస్టీయూ నాయకులు, ఆర్‌యుపిపి, స్కూల్ అసిస్టెంట్ అసోసియేషన, ఎస్సీ, ఎస్టీ అసోసియేషన నాయకులు ఎన్సీపీ అసోసియేషన, ఆర్జేయూపీ, హౌసింగ్ బిల్డింగ్ సొసైటీ, ఎస్టీఎఫ్, ఎస్‌ఆర్‌టీఎఫ్, ఎనటీఏ, ఎస్‌ఎల్‌టీఏ, సీపీఎస్ అసోసియేషన, వైఎస్సార్ టటీచర్ అసోసియేషన, బహుజన టటీచర్స్ అసోసియేషన, ఐటా అసోసియేషన, పీఈటీ అసోసియేషన్ల నేతలు పాల్గొన్నారు.