దారి సమస్యను పరిష్కరించాలంటూ ధర్నా
ABN , Publish Date - Feb 01 , 2025 | 11:50 PM
దారి సమస్య ను పరిష్కరించా లంటూ జాతీయ రహదారిపై స్థానిక చాకలబండవీధి వాసులు శనివారం ధర్నా చేశారు.
వాల్మీకిపురం, ఫిబ్రవరి 1(ఆంధ్రజ్యో తి): దారి సమస్య ను పరిష్కరించా లంటూ జాతీయ రహదారిపై స్థానిక చాకలబండవీధి వాసులు శనివారం ధర్నా చేశారు. స్థానిక చాకలబండవీ ధిలో గత 40ఏళ్లకు పైగా నివాసం ఉంటున్నామని అయితే కొందరు వ్య క్తులు నివాసాల నడుమ దారికి సం బంధించి పట్టా భూములంటూ ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ స్థానికులు ఆందోళనకు దిగారు. తిరుపతి రోడ్డులోని పెట్రోల్ బంక్ వద్ద జాతీయ రహదారిపై బైఠాయించి ధర్నాచేశారు. సుమారు 100కు పైగా కుటుంబాలు నివసిస్తున్న ప్రాంతంలో ప్రస్తుతం దారి సమస్యతో ఇబ్బందులకు గురవుతున్నామని సమస్యను పరిష్కరించే దాకా కదిలేది లేదంటూ కూర్చున్నారు. దీంతో జాతీయ రహదారిపై అరగంట పాటు వాహనాల రాకపోకలు ఆగిపోయి తీవ్ర అంతరాయం నెలకొంది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆందోళనకారుల కు నచ్చజెప్పి ధర్నా విరమింపచేశారు. అయితే సోమవారం స్థానిక రెవెన్యూ కార్యాల యం వద్ద తామంతా ఆందోళన చేపడతామని గ్రామస్థులు తెలిపారు. ఈకార్యక్రమంలో చాకలబండవీధి మహిళలు, యువత తదితరులు పాల్గొన్నారు.