రీసర్వేని వేగంగా చేపట్టండి
ABN , Publish Date - Aug 13 , 2025 | 10:44 PM
మండలంలో రీసర్వే త్వరగా చేపట్టాలని మద నప ల్లె సబ్‌కలెక్టర్ చల్లా కళ్యాణి సూచించారు
కురబలకోట, ఆగస్టు 13(ఆంధ్ర జ్యోతి): మండలంలో రీసర్వే త్వరగా చేపట్టాలని మద నప ల్లె సబ్‌కలెక్టర్ చల్లా కళ్యాణి సూచించారు. బుధవారం తహ సీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మి కంగా తనిఖీ చేసి అధికారు లతో మాట్లాడుతూ మండల పరిధిలో తప్పులు తలెత్తకుండా రీ సర్వేని త్వరగా లక్ష్యాలను పూర్తి చేయాలన్నారు. పీజీఆర్‌ఎస్ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడం, గ్రామాల్లో పర్యటించి సమ స్యలను పూర్తి చేయాలన్నారు. అనంతరం కురబలకోట కార్యాలయంలో రికార్డులు పరిశీలించి సలహాలు, సూచనలు అందజేశారు. కె.ధనంజయులు, ఆర్‌ఐ శేషాద్రి, సర్వేయర్ భువనేశ్వరి, వీఆర్‌వోలు తదితరులు పాల్గొన్నారు.
ఫిర్యాదులపై తక్షణం స్పందించండి
బి.కొత్తకోట, ఆగస్టు13(ఆంధ్రజ్యోతి): పీజీఆర్‌ఎస్ ఫిర్యాదులు, రీసర్వే సమస్యలపై తక్షణం స్పందించాలని సబ్‌కలెక్టర్ కల్యాణి ఆదేశించారు. బి.కొత్తకోట తహసీల్దార్ కార్యాలయంలో ఆమె రెవెన్యూ సిబ్బందితో సమీక్షిస్తూ మండల భౌగోళిక స్థితిగతులు, ప్రధాన సమస్యలు, హార్సిలీహిల్స్ గురించి తహసీల్దార్ బావాజాన్‌ను అడిగి తెలుసు కున్నారు. డీటీ బాలాజి, ఆర్‌ఐ వీరాంజనేయులు వీఆర్వోలు, సర్వేయర్ పాల్గొన్నారు.