పంచాయతీ నిధుల దుర్వినియోగంపై ఫిర్యాదు
ABN , Publish Date - Jan 16 , 2025 | 11:32 PM
మదనపల్లె మండలం సీటీఎం- 2 గ్రామ పంచాయతీ నిధులు దుర్వి నియోగం అయ్యాయని వచ్చిన ఫిర్యాదు లపై డీఎల్‌పీవో నాగరాజు విచా రణ చేపట్టారు.

డీఎల్‌పీవో విచారణ ఫ రికార్డులు స్వాధీనం
మదనపల్లె టౌన, జనవరి 16(ఆంరఽధ జ్యోతి): మదనపల్లె మండలం సీటీఎం- 2 గ్రామ పంచాయతీ నిధులు దుర్వి నియోగం అయ్యాయని వచ్చిన ఫిర్యాదు లపై డీఎల్‌పీవో నాగరాజు విచా రణ చేపట్టారు. గురువారం సీటీఎం-2 సచివా లయంలో ఫిర్యాదిదారుడితో పాటు, అధి కారులను డీఎల్‌పీవో విచారించారు. ఈ సందర్భంగా ఆర్‌ఎస్‌ఎఫ్ నాయకుడు ఉత్త న్న మాట్లాడుతూ ఐదేళ్లుగా సీటీఎం-2 పంచాయతీకి ప్రభుత్వం మంజూరు చేసిన నిధులు, ఇతర వనరుల ద్వారా గ్రామ పంచాయతీకి వచ్చిన ఆదాయం, ఖర్చుల వివరాల కోసం ఆర్‌టీఐ ద్వారా తాను దరఖాస్తు చేసుకుంటే, ఆరు నెలలు అయినా సమాచారం ఇవ్వలేదన్నారు. దీనిపై డిప్యూటీ సీఎం పవన కళ్యాణ్, రాష్ట్ర మంత్రి లోకేశకు ఫిర్యాదు చేశామన్నారు. డీఎల్‌పీవో నాగరాజు మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి జిల్లా కలెక్టర్‌కు, అక్కడి నుంచి డీపీవో ద్వారా తనకు ఫిర్యాదు కాపీలు వచ్చాయని దీనిపై సమగ్ర విచారణ చేస్తున్నామన్నారు. అంతే కాకుండా పంచాయతీ సచివాలయంలోని రికార్డులను స్వాధీనం చేసుకుంటున్నామని, ఒకవేళ నిధులు దుర్వినియోగం అయివుంటే వాటిపై కలెక్టర్‌కు నివేదికలు ఇస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఈవోఆర్‌డీ అబ్దుల్ షుకూర్, అధికారులు పాల్గొన్నారు.