Share News

సబ్‌కలెక్టర్‌ జోక్యంతో బస్‌షెల్టర్‌ వివాదానికి తెర

ABN , Publish Date - Feb 14 , 2025 | 11:49 PM

మదనపల్లె సబ్‌కలెక్టర్‌ మేఘస్వరూప్‌ జోక్యంతో బి.కొత్తకోట పట్టణ నడిబోడ్డున జ్యోతిసర్కిల్‌లో వద్ద బస్‌షెల్టర్‌ విషయంలో నెలకొన్న వివాదానికి తెరపడింది.

సబ్‌కలెక్టర్‌ జోక్యంతో బస్‌షెల్టర్‌ వివాదానికి తెర
నూతన భవన నిర్మా ణ పనులకు శ్రీకారం చుట్టిన కమిషనర్‌ జీవీ పల్లవి

కొత్త భవనాల నిర్మాణానికి కమిషనర్‌ పల్లవి భూమిపూజ

బి.కొత్తకోట, ఫిబ్రవరి 14(ఆంధ్రజ్యోతి): మదనపల్లె సబ్‌కలెక్టర్‌ మేఘస్వరూప్‌ జోక్యంతో బి.కొత్తకోట పట్టణ నడిబోడ్డున జ్యోతిసర్కిల్‌లో వద్ద బస్‌షెల్టర్‌ విషయంలో నెలకొన్న వివాదానికి తెరపడింది. దీంతో నగరపంచాయతీ కమిషనర్‌ జీవీ పల్లవి శుక్రవారం రెవెన్యూ, పోలీస్‌సిబ్బంది సహకారంతో నూతన భవనాల నిర్మాణానికి భూమిపూజ చేసి పనులు కూడా ప్రారంభించడం చకచకా జరిగిపోయాయి. ఏళ్లతరబడి పట్టణం లోని జ్యోతిసర్కిల్‌తో పాటు ప్రధాన రోడ్లకు ఇరువైపుల ఉన్న డ్రైనేజీలను ఆక్రమించు కొని పలువురు వ్యాపారాలు చేసుకునేవారు. కమిషనర్‌గా పల్లవి బాధ్యతలు చేపట్ట గానే ఆక్రమణలపై దృష్టిసారించి ఎక్స్‌కవేటర్లతో ఆక్రమణలను తొలగించారు. ఇందులో భాగంగా జ్యోతిసర్కిల్‌లో దశాబ్దాల క్రితం లయన్సక్లబ్‌ ఆధ్వర్యంలో నిర్మించిన బస్‌షె ల్టర్‌, వాటర్‌ట్యాంక్‌ చుట్టుపక్కల ప్రదేశం కబ్జాదారుల నుంచి విముక్తి పొందాయి. ఆ కాలంచెల్లిన బస్‌షెల్టర్‌ తొలగించి, ప్రజాసౌకర్యార్థం ఆధునిక మరుగుదొడ్లను నిర్మించాలని ఇటీవల ప్రయత్నించగా కొందరు ఆ స్థలం తమదంటూ అడ్డుతగిలారు. దీంతో తాత్కాలికంగా బ్రేక్‌పడింది. దీనిపై మదనపల్లె సబ్‌కలెక్టర్‌ మేఘస్వరూప్‌కు ఫిర్యాదు వెళ్లడంతో ఆయ న స్పందించి సర్యేయర్‌ను పంపి, నిర్మాణానికి సహకరించా లని, ఎవరైనా అడ్డొస్తే బైం డోవర్‌ కేసు నమోదు చేయాలని తహశీల్దార్‌ అజారుద్దీనను ఆదేశించారు. నగర పంచాయతీ అధికారులు పోలీసులకూ ఫిర్యాదు చేశారు. దీంతో వివాదానాకి తెరపడి నూతన భవనాలకు భూమిపూజచేసి పనులు ప్రారంభించారు.

బీవోటీ విధానంలో లీజుకు..

బి.కొత్తకోట జ్యోతిసర్కిల్‌లో పురాతన భవనం స్థలంలో భవన నిర్మాణానికి నగరపంచా యతీ అధికారులు బీవోటీ(బిల్డ్‌ ఆపరేట్‌ అండ్‌ ట్రాన్సఫర్‌) ప్రాతిపదికన ఒప్పందం కుదుర్చుకున్నారు. అన్నమయ్య జిల్లా సుండుపల్లికి చెందిన జీపీవీ రమణ ఫౌండేషన ప్రతినిధి రవిప్రకాష్‌ ఈ నిర్మాణాన్ని చేపట్టి, ఒప్పందం మేరకు కొన్నేళ్లు ఆధునిక మరుగుదొడ్లు నిర్మించి నిర్ణీత రుసుం వసూలు చేసుకొని, అనంతరం భవనాన్ని నగర పంచాయతీకి అప్పగిస్తారు. వాటర్‌ట్యాంకు చుట్టూ ప్రహరీని నిర్మించి, వాహనస్టాండ్‌ ను ఏర్పాటు చేయబోతున్నట్లు కమిషనర్‌ జీవీ పల్లవి పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏవో రమాదేవి, వీఆర్‌వోలు శ్రీరాములు, మల్లికార్జున, పోలీస్‌సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Feb 14 , 2025 | 11:50 PM