సమాజంలో మహిళలపై దాడులను అరికట్టాలి
ABN , Publish Date - Feb 24 , 2025 | 12:10 AM
మహిళలు, బాలికలపై సమాజంలో నానాటికి జరుగుతున్న దాడులను అరికట్టాలని ఐద్వా పట్టణ ఉపాధ్యక్షురాలు మోక్షమ్మ, కైరునబీలు పేర్కొన్నారు.

బద్వేలు, ఫిబ్రవరి23 (ఆంధ్రజ్యోతి): మహిళలు, బాలికలపై సమాజంలో నానాటికి జరుగుతున్న దాడులను అరికట్టాలని ఐద్వా పట్టణ ఉపాధ్యక్షురాలు మోక్షమ్మ, కైరునబీలు పేర్కొన్నారు. ఆదివారం కడపలో జరిగే విస్త్రృత స్థాయి సమావేశానికి తరలివెళ్లారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజం కుటుంబ న్యాయవ్యవస్థ, ప్రభుత్వాలు, పోలీసులు, మహిళలకు న్యాయం కల్పించేలా చర్యలు చేపట్టాలని కోరారు. సోషల్ మీడియా, సెల్‌ఫోన్లలో నీలిచిత్రాలను అరికట్టేలా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని కోరారు. ఈకార్యక్రమంలో పలువురు ఐద్వా సంఘం నాయకురాళ్లు పాల్గొన్నారు.