భూ సమస్యల పరిష్కారానికి ఫిర్యాదుల వెల్లువ
ABN , Publish Date - Feb 10 , 2025 | 11:34 PM
భూ సమస్యలు పరిష్కరిం చాలంటూ పలువురు రైతులు మద నపల్లె సబ్ కలెక్టర్ మేఘస్వరూప్‌కు విజ్ఞప్తి చేశారు.

మదనపల్లె అర్బన, ఫిబ్రవరి 10(ఆం ధ్రజ్యోతి):భూ సమస్యలు పరిష్కరిం చాలంటూ పలువురు రైతులు మద నపల్లె సబ్ కలెక్టర్ మేఘస్వరూప్‌కు విజ్ఞప్తి చేశారు. సోమవారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన పీజీ ఆర్‌ఎస్ కార్యక్రమంలో రైతుల నుంచి భూ సమస్యలు పరిష్కరించాలంటూ అధికంగా ఫిర్యాదులు అందాయి. ఇం దులో బి.కొత్తకోటకు చెందిన డేరంగుల పెద్దఓబులేసు తన ఫిత్రా ర్జితంగా సంక్రమించిన గ్రామ సర్వేనెంబరు245లో 13 ఎకరా లు, 243 సర్వేనెంబర్‌లో 8.5 ఎకరాల భూమిని 300మందికి పేదలకు ఇవ్వడానికి సిద్ధం చేశామని ప్రస్తుతం మాజీ ఎంపీపీ ఖలీల్, చంద్రశేఖర్, గార్ల నాగరాజులు సర్వేనెంబరు 243లో తప్పుడు పత్రాలను 9ఎకరాల 27 సెంట్లకు సృష్టించుకుని మాపై దౌర్జ న్యం చేస్తున్నారని సబ్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. బి. కొత్తకోట మండలం, కోటావూరు గ్రామంకు చెందిన బి. లక్ష్మీదేవమ్మ తన భర్త రామచంద్రారెడ్డి మృతి చెందాడని, ఉన్న భూమిని పట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వకుండా రెవెన్యూ అధికారులు తిప్పుతున్నారని ఫిర్యాదు చేశారు. బీకేపల్లె లక్ష్మీనగర్‌కు చెందిన గంగులప్ప కుమారుడు స్వామివేలుకు దివ్యాం గుల పెన్షన రావ డంలేదని సబ్‌కలెక్టర్‌కు విన్నవించారు.