Share News

ఈవ్‌ టీజింగ్‌కు పాల్పడితే చర్యలు : సీఐ

ABN , Publish Date - Feb 17 , 2025 | 12:13 AM

ఈవ్‌టీచింగ్‌, ఆకతాయి పనులకు పాల్పడితే చర్యలు త ప్పవని సీఐ ఎస్‌కే రోషన హెచ్చరించారు.

ఈవ్‌ టీజింగ్‌కు పాల్పడితే చర్యలు : సీఐ
విద్యార్థినులకు సలహాలు, సూచనలు ఇస్తున్న సీఐ రోషన

కమలాపురం రూరల్‌, ఫిబ్రవరి 16 (ఆంధ్రజ్యోతి) : ఈవ్‌టీచింగ్‌, ఆకతాయి పనులకు పాల్పడితే చర్యలు త ప్పవని సీఐ ఎస్‌కే రోషన హెచ్చరించారు. ఆదివారం ఎ స్పీ అశోక్‌కుమార్‌ ఆదేశాల మేరకు డీఎస్పీ వెంకటేశ్వర్లు సహకారంతో కమలాపురం పట్టణంలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ గురుకుల పాఠశాల, జూనియర్‌ కళాశాలల్లో ర్యాగింగ్‌పై అవగాహన కల్పించారు. అక్కడే పాఠశాల, కళాశాల విద్యార్థులు సిబ్బందితో మాట్లాడిన ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు ఈవ్‌టీజింగ్‌, ఆకతాయిల వల్ల ఏవైనా ఇబ్బందులు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. ఈవ్‌టీజింగ్‌ వల్ల చాలా మంది విద్యార్థుల జీవితాలు నాశనమయ్యాయని, ఎంతో మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారని ఆయన గుర్తు చేశారు. అనంతరం విద్యార్థుల వసతి గదులను సందర్శించి శు భ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ ప్రతా్‌పరెడ్డి, ప్రిన్సిపాల్‌ తులశమ్మ, ఉపాధ్యాయులు అధ్యాపకులు, పోలీసులు పాల్గొన్నారు.

Updated Date - Feb 17 , 2025 | 12:14 AM