Share News

TDP: మహానాడు వైఎస్‌ కుటుంబానికి చెంపపెట్టు

ABN , Publish Date - May 31 , 2025 | 05:36 AM

టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కడప మహానాడు అత్యంత విజయవంతంగా నిర్వహించబడిందని పేర్కొన్నారు. జగన్ కుటుంబానికి చెంపపెట్టులా కడప వైసీపీ నాయకులు ఉన్నారు అని ప్రగల్భంగా వ్యాఖ్యానించారు.

TDP: మహానాడు వైఎస్‌ కుటుంబానికి చెంపపెట్టు

కడప మారుతీనగర్‌, మే 30(ఆంధ్రజ్యోతి): ‘వైఎస్‌ కుటుంబానికి కడప జిల్లా కంచుకోట అని ప్రగల్భాలు పలికే వైసీపీ ఉత్తర కుమార నాయకులకు చెంపపెట్టులా... కడపలో మహానాడు అద్భుతంగా జరిగింది. పార్టీ ఆవిర్భావం నుంచి జరిగిన మహానాడులు అన్నింటినీ మించి కడప మహానాడు విజయవంతం అయింది’ అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం ఇక్కడ పాత్రికేయుల సమావేశంలో ఆయన మంత్రులు, ఎంఎల్‌సీలు, ఎమ్యెల్యేలతో కలసి మాట్లాడారు. ‘రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పాలన చేపట్టి సంవత్సరం అవుతోంది. ప్రజలకు సీఎం చంద్రబాబు పట్ల అపారమైన నమ్మకం ఉందని మహానాడు సభ నిరూపించింది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ ప్రతిపాదించిన ఆరు శాసనాలు భవిష్యత్తులో పార్టీని బంగారు బాటలో నడిపించేందుకు ఎంతగానో దోహదపడతాయి. మహానాడును విజయవంతం చేసిన ఉమ్మడి కడప జిల్లా పార్టీ నాయకులకు, ప్రత్యేకించి కార్యకర్తలు, ప్రజలు, అభిమానులకు ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు’ అని పల్లా అన్నారు.


ఇవి కూడా చదవండి

ప్రజలతో మమేకమవ్వండి.. నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం

ఫేస్‌బుక్ పరిచయం.. యువతికి లంచ్ ఆఫర్.. చివరకు

Read Latest AP News And Telugu News

Updated Date - May 31 , 2025 | 05:36 AM