జగన్‌కు బుద్ధి రావాలని దేవుడిని ప్రార్థించా కేఏ పాల్
ABN , Publish Date - Mar 05 , 2025 | 03:50 AM
జగన్మోహన్‌రెడ్డికి బుద్ధి రావాలని దేవుడిని ప్రార్థించానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ చెప్పారు.

విశాఖపట్నం, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి బుద్ధి రావాలని దేవుడిని ప్రార్థించానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ చెప్పారు. విశాఖలోని కేఏ పాల్ ఫంక్షన్ హాలులో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ...జగన్ అసెంబ్లీకి వెళ్లాలని, ప్రజల సమస్యలపై పోరాటం చేయాలని దేవుడిని కోరానన్నారు. రెడ్‌బుక్ ప్రకారం చూసుకుంటే త్వరలో కొడాలి నాని, రోజాలను అరెస్టు చేస్తారన్నారు. బూతులు తిట్టిన వారిపై కేసులు పెట్టి లోపల వేస్తున్నారన్నారు. జగన్‌ను కూడా అరెస్టు చేసి లోపల వేసే అవకాశం ఉందన్నారు.