Share News

JVV: జేవీవీ నూతన అధ్యక్షునిగా శ్రీనివాసులు

ABN , Publish Date - Jul 15 , 2025 | 04:16 AM

జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షునిగా నెల్లూరు జిల్లాకు చెందిన కె.శ్రీనివాసులు ఎన్నికయ్యారు

JVV: జేవీవీ నూతన అధ్యక్షునిగా శ్రీనివాసులు

కడప ఎడ్యుకేషన్‌, జూలై 14 (ఆంధ్రజ్యోతి): జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షునిగా నెల్లూరు జిల్లాకు చెందిన కె.శ్రీనివాసులు ఎన్నికయ్యారు. కడపలో శని, ఆదివారాల్లో జేవీవీ 18వ రాష్ట్ర సభలు జరిగాయి. ఈసందర్భంగా రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ప్రధాన కార్యదర్శిగా వైఎస్సార్‌ కడప జిల్లాకు చెందిన బి.విశ్వనాథ, కోశాధికారిగా విజయనగరం జిల్లాకు చెందిన డాక్టర్‌ పైల రమేశ్‌రాజు, రాష్ట్ర కార్యదర్శిగా కడప జిల్లాకు చెందిన భాస్కర్‌, రాష్ట్ర సలహామండలి సభ్యునిగా కె.సురేశ్‌బాబు ఎన్నికయ్యారు.

Updated Date - Jul 15 , 2025 | 04:16 AM