Mallikarjun Kharge: పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా జేడీ శీలం, మస్తాన్ వలీ
ABN , Publish Date - Aug 07 , 2025 | 04:58 AM
పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులుగా మాజీ ఎంపీ జేడీ శీలం, సీనియర్ నేత మస్తాన్ వలీని నియమించారు
రాష్ట్ర పీఏసీ పునర్‌వ్యవస్థీకరణ
న్యూఢిల్లీ, ఆగస్టు 6(ఆంధ్రజ్యోతి): పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులుగా మాజీ ఎంపీ జేడీ శీలం, సీనియర్ నేత మస్తాన్ వలీని నియమించారు. ఈ మేరకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నిర్ణయం తీసుకున్నారు. తమిళనాడు కాంగ్రెస్ ఎంపీ మాణిక్కం ఠాగూర్ చైర్మన్‌గా ఏపీ కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీని కూడా పునర్‌వ్యవస్థీకరించారు. 25 మంది సభ్యులున్న ఈకమిటీలో పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, వర్కింగ్ ప్రెసిడెంట్లు జేడీ శీలం, మస్తాన్ వలీతో పాటు రఘువీరారెడ్డి, కొప్పుల రాజు, పళ్లంరాజు, గిడుగు రుద్రరాజు, కేవీపీ రామచంద్రరావు, చింతా మోహన్, కె.బాపిరాజు, హర్షకుమార్, తులసి రెడ్డి, కిల్లి కృపారాణి తదితరులు ఉన్నారు.