K. Naga Babu : ఎమ్మెల్సీ అభ్యర్థిగా నేడు నాగబాబు నామినేషన్
ABN , Publish Date - Mar 07 , 2025 | 07:46 AM
జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కె.నాగబాబు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా శుక్రవారం ఉదయం నామినేషన్ దాఖలు చేయనున్నారు.

అమరావతి, మార్చి 6(ఆంధ్రజ్యోతి): జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కె.నాగబాబు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా శుక్రవారం ఉదయం నామినేషన్ దాఖలు చేయనున్నారు. నామినేషన్ పత్రాలపై గురువారం సాయంత్రమే అభ్యర్థితో సంతకాలు చేయించారు. నాగబాబు అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదిస్తూ 10 మంది... మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్యేలు మండలి బుద్ధప్రసాద్, లోకం నాగ మాధవి, ఆరణి శ్రీనివాసు తదితరులు సంతకాలు చేశారు. మంత్రి నాదెండ్ల మనోహర్ స్వయంగా ఈ బాధ్యత తీసుకొన్నారు.