Jagan media: తిరుమలలో బాలుడి మరణంపై జగన్ మీడియా దుష్ప్రచారం
ABN , Publish Date - Feb 26 , 2025 | 05:37 AM
తిరుమల అన్నదాన సత్రంలో తొక్కిసలాటలో ఒక బాలుడు మృతి చెందాడంటూ వార్త ప్రసారం చేసింది. నిజానికి మంజునాథ్(16) గుండెపోటుతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు.

గుండెపోటుతో మరణిస్తే తొక్కిసలాటలో మృతి అంటూ కథనాలు
తప్పుడు వార్తలు ప్రసారం చేస్తే చర్యలు: టీటీడీ
తిరుమల, ఫిబ్రవరి 25(ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం మీద, టీటీడీ మీద బురదచల్లడమే లక్ష్యంగా పెట్టుకున్న జగన్ మీడియా తాజాగా ఒక తప్పుడు వార్త ప్రసారం చేసి నవ్వులపాలైంది. తిరుమల అన్నదాన సత్రంలో తొక్కిసలాటలో ఒక బాలుడు మృతి చెందాడంటూ వార్త ప్రసారం చేసింది. నిజానికి మంజునాథ్(16) గుండెపోటుతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. ఆ విషయాన్ని మంగళవారం టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి మీడియాకు వెల్లడించారు. కర్నాటకలోని మడికెరకు చెందిన మల్లేష్, నాగరత్నమ్మ కుటుంబం శనివారం తిరుమలకు వచ్చారు. అదేరోజు అన్నదాన కేంద్రానికి వెళ్లినప్పుడు ర్యాంప్‌పై పరుగు తీస్తున్న వారి కుమారుడు మంజునాథ్ హఠాత్తుగా కుప్పకూలిపోయాడు.
తిరుపతిలోని స్విమ్స్ సూపర్ స్పెషాలటీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంజునాథ్ మంగళవారం మృతి చెందాడు. జగన్ మీడియాతో పాటూ సోషల్ మీడియాలో కూడా ఈ వార్తపై అసత్య ప్రచారం కావడంతో టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి అన్నదాన కేంద్రంలోని సీసీ టీవీ ఫుటేజిని మీడియాకు చూపించారు. బాలుడి తల్లిదండ్రులే తమ బిడ్డకు గుండె సంబంధిత సమస్య ఉందని అంగీకరించి పోస్టుమార్టం కూడా వద్దని చెప్పి మృతదేహాన్ని తీసుకెళతామని తెలిపారన్నారు. టీటీడీపై బుదరజల్లే విధంగా తప్పుడు వార్తలు ప్రచురించి అవాస్తవాలు ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని టీటీడీ ఒక ప్రకటనలో హెచ్చరించింది.
మరిన్నీ తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: డీఎస్సీపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
Also Read : మాజీ ఎంపీకి జీవిత ఖైదు
Also Read: రైతుల కోసం ఈ పథకాలు.. వీటి వల్ల ఎన్నో లాభాలు.. ఇదే అర్హత.. ఇలా అప్లై చేసుకోండి చాలు
Also Read : అసోం బిజినెస్ సమ్మిట్‌లో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
Also Read: రిమాండ్ మళ్లీ పొడిగింపు.. విచారణలో నోరు విప్పని వంశీ
For National News And Telugu News