Share News

Jagan: అధికారంలోకి వచ్చేది మనమే

ABN , Publish Date - May 08 , 2025 | 05:23 AM

వైసీపీ అధ్యక్షుడు జగన్‌ మోహన్‌రెడ్డి పార్టీ నాయకులతో సమావేశంలో మాట్లాడుతూ, వచ్చే ఏడాది ప్లీనరీని ఘనంగా నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఆయన చంద్రబాబు ప్రభుత్వంపై మండిపడి, కేసులపై భయపడకూడదని పేర్కొన్నారు

Jagan: అధికారంలోకి వచ్చేది మనమే

  • కేసులు లేకుండా రాజకీయాలు ఉండవు: పార్టీ నాయకులతో జగన్‌

అమరావతి, మే 7(ఆంధ్రజ్యోతి): ‘అధికారంలోకి వచ్చేది కచ్చితంగా వైసీపీనే. వచ్చే ఏడాది బ్రహ్మాండంగా ప్లీనరీని నిర్వహిస్తా’ అని ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహనరెడ్డి ప్రకటించారు. తాడేపలిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ పార్లమెంటరీ సమన్వయకర్తలతో జగన్‌ సమావేశమయ్యారు. ‘చంద్రబాబులా నేను అబద్ధ్దాలు చెప్పలేను. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ హయాంలోని సంక్షేమ పథకాలన్నింటిని రద్దు చేశారు. కేసులు లేకుండా రాజకీయాలు ఉండవు. పోలీసు కేసులకు భయపడవద్దు. రాష్ట్రంలో 12 నెలలుగా చంద్రబాబు రెడ్‌ బుక్‌ రాజ్యాంగాన్ని నడుపుతున్నారు. ప్రజలు భయాందోళనల్లో బతుకుతున్నారు. వైసీపీని అభిమానించేవారిని కొడుతున్నారు. ఇది నన్ను బాధిస్తోంది. నా అభిమానులను రక్షించుకోవాల్సిన బాధ్యత నాపైనే ఉంది’ అని జగన్‌ అన్నారు.

Updated Date - May 08 , 2025 | 05:23 AM