Share News

Jagan: మేమంతా మీతోనే ఉన్నాం

ABN , Publish Date - May 08 , 2025 | 06:06 AM

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సాయుధ దళాలు చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌ పై స్పందించిన జగన్‌ ‘మేమంతా మీతోనే ఉన్నాం. జై హింద్‌’ అని తెలిపారు. ఈ చర్య జాతి ఐకమత్యాన్ని ప్రతిఫలిస్తుందని ఆయన పేర్కొన్నారు.

Jagan: మేమంతా మీతోనే ఉన్నాం

అమరావతి, మే 7(ఆంధ్రజ్యోతి): పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సాయుధ దళాలు ఆపరేషన్‌ సిందూర్‌ని చేపట్టాయని మాజీ సీఎం జగన్‌ అన్నారు. బుధవారం ఆయన ఎక్స్‌ వేదికగా స్పందించారు. ‘ఇలాంటి సమయాల్లో, తప్పనిసరి పరిస్థితుల్లో చేపట్టిన ఇలాంటి చర్యలు చెక్కుచెదరని జాతి ఐకమత్యాన్ని ప్రతిఫలిస్తాయి. మేమంతా మీతోనే ఉన్నాం. జై హింద్‌’ అని జగన్‌ పేర్కొన్నారు.

Updated Date - May 08 , 2025 | 06:06 AM